కోర్టు తీర్పు అమలు చేయాలి : జానారెడ్డి

 

హైదరాబాద్, ఆగష్టు 17  (globelmedianews.com)
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ సభ్యత్వాల పునరుద్ధరణపై ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి  డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును గౌరవించనందుకే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారని, ఈ విషయాన్ని సాగదీయడం ప్రభుత్వానికి మంచిది కాదని జానారెడ్డి సూచించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వమ్యంలో అత్యున్నత గౌరవ ప్రదమైన ఇన్ స్టి స్ట్యూషన్ కోర్టు. అటువంటి కోర్టు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల స్థానాలను పునరుద్ధరించాలని,  జీత భత్యాలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చిందని అయన గుర్తు చేసారు. ఇది వ్యక్తిగత ప్రతిష్ట కాదు. 
 
 
 
కోర్టు తీర్పు అమలు చేయాలి : జానారెడ్డి 
 
రాజ్యాంగ ప్రతిష్ట కాబట్టి తీర్పును అమలుచేయాలని కోరుతున్నా. కుసంస్కార మాటలు మాట్లాడే వ్యక్తులపై నేను మాట్లాడను. మన మాటలు, భాష హుందాగా ఉండాలని అయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందరూ...అన్ని పార్టీలు సిద్దంగా ఉంటాయి. ఐదేళ్లు ఉండాల్సిన ప్రభుత్వం ముందస్తుకు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలని అయన అన్నారు. లేకుంటే ప్రజా ధనం వృధా అవుతుంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం.  పార్లమెంట్, అసెంబ్లీ ఒకేసారి ఉంటే ముందస్తుకు వెళ్లొచ్చు...కానీ అవి వేర్వేరుగా ఉంటే ముందస్తు వెళ్లడమెందుకని అయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి ఇంకా ఎక్కువరోజులు ఉంటే  ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారని, ముందస్తుకు వెళుతున్నారనుకుంటానని అయన అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీకి సేవ చేస్తాను. పొత్తుల పై మా నాయకులంతా చర్చించి మా అధిష్టానానికి నిర్ణయం తెలియజేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మా పార్టీకి ఇబ్బంది లేకుండా ఉండే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలో చూద్దామని అయన అన్నారు.

No comments:
Write comments