చంద్రబాబు, జగన్ ఇద్దరూ అవినీతిపరులే! కేంద్ర నిధుల్ని దుర్వినియోగం చేస్తున్న ఏపీ సర్కారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్

 

గుంటూరు ఆగష్టు 11 (globelmedianews.com)
బాబు బీజేపీని విమర్శించడం చూస్తుంటే.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లు ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు అందిస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పోరాటంలో వెనుకపడి పోతానన్న భయంతోనే చంద్రబాబు కొత్తగా హోదా పాట అందుకున్నారని విమర్శించారు. హోదాపై జగన్ ప్రసంగాలకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు. దీన్ని గమినించిన బాబు తాను వెనుకపడతానన్న భయంతో సానుభూతి కోసం హోదా గురించి మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో దేవధర్ మాట్లాడారు. చంద్రబాబు జీవితంలో సొంత బలంతో ఎన్నడూ అధికారంలోకి రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు అవినీతిపరులు చంద్రబాబు.. జగన్ తో పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబుకు అవినీతి ధనం, మీడియా మద్దతు ఉంటే, బీజేపీ వైపు ప్రధాని మోదీ, ధర్మం, నీతి, నిజాయితీ ఉన్నాయన్నారు.ఇటీవల అగర్తలాలో విజయం సాధించామనీ, త్వరలోనే అమరావతిలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
 
 
 
చంద్రబాబు, జగన్ ఇద్దరూ అవినీతిపరులే!
కేంద్ర నిధుల్ని దుర్వినియోగం చేస్తున్న ఏపీ సర్కారు
       బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్

No comments:
Write comments