పెట్టుబడులతో రండి ముంబాయి లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బేటీ

 

ముంబాయి, ఆగష్టు 27 (globelmedianews.com) 
ముంబాయి   తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అమరావతిపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేదే తన విజన్ అని చెప్పారు.ఏపీ  రాష్ట్రాన్ని ఆవాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో మొబైల్ తయారీని 25 నుంచి 50 శాతానికి పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు సమావేశంలో తెలిపారు. 2050 నాటికి ఏపీ ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్ గా ఉండాలనేది తన లక్ష్యమని, దానికి అనుగుణంగానే గత నాలుగేళ్లుగా ఏపీ వృద్ధి రేటును నమోదు చేస్తోందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా అగ్రస్థానంలో నిలబడుతోందని చెప్పారు. పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమని తెలిపారు. ఈ భేటీలో రతన్ టాటా, నారాయణ మూర్తి, టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్ లు కూడా పాల్గొన్నారు.
 
 
 
 పెట్టుబడులతో రండి
ముంబాయి లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బేటీ
 
రాష్ట్రంలో ఏరోస్పేస్, హెల్త్, పెట్రో కెమికల్స్, రక్షణ రంగాలకు తమ వద్ద సరైన విధానాలు ఉన్నాయని... భూ బ్యాంకు కూడా అందుబాటులో ఉందని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని తెలిపారు. ఏపీలో హోటల్ డెవలప్ మెంట్ కు టాటా గ్రూపు సహకరించాలని, విజయవాడ-సింగపూర్ ల మధ్య విమానాలు నడపాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ప్రజా రవాణా వ్యవస్థలో టాటా గ్రూపు సాంకేతిక సహకారాన్ని అందించాలని విన్నవించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు ముందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. 

No comments:
Write comments