ఉద్యమంలా గ్రీన్ ఛాలెంజ్

 

హైదరాబాద్, ,ఆగష్టు 11(globelmedianews.com)
తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ ఓ ఉద్యమంలా నడుస్తోంది. రాజకీయ నేతల నుంచి సినీ, వ్యాపార ప్రముఖుల వరకు అందరూ సవాల్ విసురుకొని.. మొక్కలు నాటడంలో బిజీ అవుతున్నారు. సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబులు ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లు ఈ లిస్ట్ ‌లో చేరారు. వీరిద్దరికి తెలంగాణ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మంత్రి తలసాని.. తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఆ ఫోటోలను షేర్ చేసిన మంత్రి.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లకు గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. ప్రతి ఒక్కరూ తెలంగాణలో జరుగుతున్న హరితహారంలో పాల్గొన్నారు.
 
 

 
ఉద్యమంలా గ్రీన్ ఛాలెంజ్

No comments:
Write comments