కంటి వెలుగు కార్యక్రమం లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

 

నల్లగొండ ఆగష్టు 9 (globelmedianews.com)
కంటి వెలుగు కార్యక్రమం లో అధికారులతో పాటు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రారంభించబోయే కంటి వెలుగు కార్యక్రమంపై ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ అధికారులుప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం మూడు నెలలుగా ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు80 బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.800 మంది వైద్య సిబ్బందితో పాటు ఇతర శాఖల నుంచి 2వేల మంది సిబ్బంది కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఒక్కో గ్రామంలో 350 మందికి కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు మంత్రి. కంటి పరీక్షలు నిర్వహించిన వారికి అవసరాన్ని బట్టి ఆపరేషన్లు నిర్వహిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

 
 
కంటి వెలుగు కార్యక్రమం లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి
                విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
 

No comments:
Write comments