కేరళ వరద బాధితుల కోసం వస్తు సామాగ్రి తీసుకువెళ్తున్న వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన హోం మంత్రి

 

హైదరాబాద్ ఆగస్టు 23, (globelmedianews.com)
దయనీయ పరిస్దితుల మధ్య ఉన్నకేరళ రాష్ట్ర వరద బాధితుల కోసం వస్తు సామాగ్రి తీసుకువెళ్తున్న వాహనాలకు జెండా ఊపి రాష్ట్ర మరియు కార్మిక శాఖ మంత్రి శ్రీ నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సచివాలయం ఎదుట బుధవారం నాడు కేరళ వెళ్తున్న వాహనాలకు జెండా ఊపారు. తెలంగాణ టూరిజం మరియు సాంస్కృతిక శాఖ సమన్వయంతో కాన్ఫడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ (సి.టి.ఆర్.ఎం.ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ నెల 19 వ తేదిన కేరళ రాష్ట్ర వరద బాధితుల కోసం వస్తు సామాగ్రి సేకరించారు. 
 
 
 
 కేరళ వరద బాధితుల కోసం వస్తు సామాగ్రి 
తీసుకువెళ్తున్న వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన హోం మంత్రి
 
ఈ కార్యక్రమంలో 200 బ్యాగుల బియ్యం, ఇతర వస్తువులు, బట్టలను సేకరించి వీటిని దాదాపు 16 వాహనాలలో భద్రపరిచారు. వాటిలో కొన్ని వాహనాలు బుధవారం నాడు బయలుదేరి కేరళకు వెళ్ళాయి. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తరపున తాను కేరళ సి.యం ను కలిసి అక్కడి పునరావాస కేంద్రాలను చూసానని అక్కడి పరిస్ధితులు హృదయవిధారకంగా ఉన్నాయన్నారు. ఊహించని వరదల కారణంగా ఇళ్ళు కూలిపోయి, బంధువులను కోల్పోయి చాలా మంది ఇబ్బంధులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహృదయంతో ఆ రాష్ట్రానికి అండగా నిలబడడంతో  రూ.25 కోట్లను ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ఈ రోజు 500 కింటాళ్ళ బియ్యం, బాలామృతం, నీటి శుధ్ధి పరికరాలు పంపారన్నారు. కొత్తగా ఏర్పడినప్పటికి తెలంగాణ రాష్ట్రం ఎంతో బాధ్యతతో పొరుగు రాష్ట్రానికి సహాయం చేస్తున్నదని తెలిపారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సి.టి.ఆర్.ఎం.ఏ ప్రతినిధులు, లిబ్బి బెంజిమన్, జోషి, దేవరాజన్ తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Write comments