పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసిన ఘనత టీఆర్‌ఎస్ ది ఐటి శాఖ మంత్రి కేటీఆర్

 

హైదరాబాద్ ఆగష్టు 28 (globelmedianews.com)
పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదని కేటీఆర్ అన్నారు. సోమవారం మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..అధికారం కోసం పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్రగల నేతలున్నరు. ఔరంగజేబు నుంచి చంద్రబాబు దాకా వెన్నుపోటు రాజకీయాలే చేసిన్రని మండిపడ్డారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధిస్తమని 2001లోనే సీఎం కేసీఆర్ చెప్పిన్రని..చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన్రని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే ఓడిస్తామని కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నరన్నారు. 
 
 
 
పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసిన ఘనత టీఆర్‌ఎస్ ది
            ఐటి శాఖ మంత్రి కేటీఆర్
 
సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే సీఎం కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి సారించారని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా టీఆర్‌ఎస్‌కే పట్టంగట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే..చెవి కోసుకుంటానని సీపీఐ నారాయణ అన్నారు. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు పేరు రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం12 సీట్లు గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.నేను 2006 నుంచి 2014 వరకు ఉద్యమంలో ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రజలు గెలిపిస్తేనే నేను శాసనసభ్యుడిని అయ్యాను. తెలంగాణ ఉద్యమంలో నేను జైలుకు పోయిన. కాంగ్రెస్ నేతలు బాత్ రూంకు వెళ్లాలన్నా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బ్లాక్ మెయిల్ చేసి బతికే వాళ్లు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నరని మండిపడ్డారు. డబ్బాలల్ల, సంచులల్ల నోట్ల క‌ట్ట‌లు పెట్టడం కాంగ్రెస్ నేతలకే తెలుసు. ఎన్నికల్లో నోట్ల కట్టలతో ఎవరు దొరికారో ప్రజలకు తెలుసని కేటీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీని 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే హామీలు నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వాలున్న పంజాబ్, పుదుచ్చేరి, కర్ణాటకలో రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని సవాలు విసిరారు. కర్ణాటకలో నాలుగు దఫాలుగా ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను పిట్టల్లా కాల్చిన చరిత్ర రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీదన్నారు. 2004నుంచి 2014వరకు తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన చరిత్ర సోనియాగాంధీదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Write comments