తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ: టీఆర్‌ఎస్

 

న్యూఢిల్లీ ఆగష్టు 10 (globelmedianews.com)
తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించకపోవడాన్ని నిరసిస్తూ ఎంపీ లోక్‌సభలో మాట్లాడారు. బైసన్ పోలో,జింఖానా మైదానాలను రాష్ర్టానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకటో నంబర్ రాష్ట్ర రహదారి అభివృద్ధికి 44 వ నంబర్ జాతీయ రహదారికి రక్షణ శాఖ భూములివ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. ఇటీవల కర్ణాటక ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలిపిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లారు. తెలంగాణకు న్యాయం చేయాలంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.
 
 
 
 తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ: టీఆర్‌ఎస్

No comments:
Write comments