రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఓటింగ్ కు దూరంగా వైసీపీ, ఆప్, పీడీపీ

 

న్యూఢిల్లీ, ఆగస్టు 10, (globelmedianews.com)
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల అభ్యర్థి బి.కె. హరిప్రసాద్‌పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్‌కు 122 ఓట్లు.. బి.కె. హరిప్రసాద్‌కు 105 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్‌ఎస్ ఎన్డీయే అభ్యర్థికి ఓటేయగా.. టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసింది.. కాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ కు ప్రధాని అభినందనలు తెలియజేశారు.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. నారాయణ్ సింగ్‌కు 125 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ ఓటువేయగా, వైసీపీ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. రాజ్యసభలో అధికార పక్షానికి తగినంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమికి 89 మంది సభ్యులు ఉండగా, బీజేడీ, అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీల ఓట్లతో హరివంశ్ నారాయణ్ సింగ్ గెలుపు సునాయాసమైంది. 
 
 
 
 రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్
ఓటింగ్ కు దూరంగా వైసీపీ, ఆప్, పీడీపీ
 
అంతకు ముందు విజయంపై ఇరు పక్షాలూ ధీమా వ్యక్తం చేశాయి.రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఎన్నికను నిర్వహించారు. బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హరివంశ్ సభ్యత్వం 2020తో ముగియనుంది. సరిపడేంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత ఛైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు ఉపాధ్యక్ష పదవికి నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అనంతరం లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ బెల్ మోగించారు. హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 230 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్ నంబర్ బోర్డు తెలిపింది. దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు. కొంతమంది తాము పొరపాటు పడ్డామని, మరికొందరు ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి డివిజన్ చేశారు. అప్పుడు హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ గెలుపును వెంకయ్యనాయుడు ఖరారు చేశారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నారాయణ్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్‌లు అభినందించారు. మధ్యతరగతి కుటుంబంలో 1956 జూన్ 30న జన్మించిన హరివంశ్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని భలియా. మంచి విద్యావంతులు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పట్టా అందుకున్నారు.కెరియర్ ప్రారంభంలో నెలకు రూ. 500 వేతనానికి పనిచేశారు. పలు న్యూస్ సంస్థలకు ఎడిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా పనిచేశారు. జేడీయూ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జీగా వ్యవహరించారు.మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. సోషలిస్ట్ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో 1974లో జేపీ చేపట్టిన ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నారు. 1977లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరారు. అనంతరం ముంబయికి మారి ధర్మయుగ్ మ్యాగజైన్‌లో 1981 వరకు పనిచేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1981 నుంచి 1984 వరకు పని చేసిన హరివంశ్. తర్వాత అమృత్ బజార్ పత్రిక మ్యాగజైన్ రవివార్‌కు అసిస్టెంట్ ఎడిటర్‌గాను.. ప్రభాత్ కబర్‌కు ఎడిటర్‌గా 25 ఏండ్లు పనిచేశారు. నితిశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ హరివంశ్‌ను 2014లో రాజ్యసభకు నామినేట్ చేసింది.

No comments:
Write comments