రిలీజ్‌కు సిద్ధమవుతున్న శైలజారెడ్డి అల్లుడు

 

హైద్రాబాద్, సెప్టెంబర్ 4 (globelmedianews.com) 
అత్త-అల్లుడు వీరిద్దరూ గొడవపడే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు సిల్వర్ స్రీన్‌పై మాగ్జిమమ్ సక్సెస్ అయ్యాయి. అందుకే చైతూ ఇప్పడు అదే కాన్పెఫ్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో చైతూ చేసిన శైలజారెడ్డి అల్లుడు త్వరలో రిలీజవ్వబోతుంది.శైలజా రెడ్డి గా రమ్యకృష్ణ, అల్లుడిగా నాగ చైతన్య పోటీపడుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌తో పాటు ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తన చిత్రాల్లో హీరోకి ఏదో ఒక డిపికల్టీని పెట్టే మారుతీ శైలజారెడ్డి అల్లుడు లో హీరోయిన్ అను ఇమ్యానుయేల్‌కి టన్నుల కొద్ది ఇగోని పెట్టి చైతూతో..అను తిక్క కుదర్చబోతున్నాడు.  అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం ఆగస్టు 31న రిలీజ్ కావాల్సి ఉంది. 
 
 
 
రిలీజ్‌కు సిద్ధమవుతున్న శైలజారెడ్డి అల్లుడు
 
కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి సెప్టెంబర్ 13 న థియేటర్లోకి వస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాచారం గ్రామంలోని పచ్చటి పొలాలమధ్య జరుగుతుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను బెటర్ మెంట్స్ కోసం మళ్లీ చిత్రీకరణిస్తున్నారు.ట్రైలర్‌లోని కామెడీ డైలాగులు సినిమాలో ఫన్‌కి కొదవలేదని చెబుతున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే అను, చైతన్యల మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని, అత్తకి అల్లుడి కి మధ్య ఈగో పోరు రసవత్తరంగా ఉంటుందని కనిపిస్తోంది. మొత్తానికి కుటుంబసభ్యులందరూ కలిసి ఎంజాయ్ చేసేలా మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.కాస్త లేటైనా వినాయక చవితి సీజన్‌లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు చైతూ. యుద్దం శరణం ప్లాప్‌ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాగచైతన్య. అదే రోజు సమంత నటించిన ‘యు టర్న్’ చిత్రం కూడా విడుదలకానుంది. మొదటిసారి వైఫ్ అండ్ హస్బెండ్‌ ఫోటీ పడుతున్న ఈ బాక్సాఫీస్ వార్‌ ఎలా ఉంటుందో చూడాలంటే సెప్టెంబర్ 13వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments:
Write comments