ఓటర్ల ఫోటోలతో గుర్తింపు కార్డులు రెడీ

 

వరంగల్, సెప్టెంబర్ 4, (globelmedianews.com)
ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు మహబూబాబాద్ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం చెప్పిన బాధ్యతలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల పెంపు అవసరం లేని చోట కుదింపు, ప్రాంతాల మార్పు వంటి ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ఓటర్ల ఫొటోలతో కూడిన ముసాయిదాను వెల్లడించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ప్రస్తుతం 6,16,674 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,09,563 మందికాగా మహిళలు 3,06,949 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదు కోసం 4,427 మంది దరఖాస్తు చేసుకోగా వారి వివరాలను పరిశీలించిన అధికారులు 4,000 మందికి పైగా ఓటు హక్కు కల్పించనున్నారు. జిల్లాలో గతంతో ఉన్న పోలింగ్‌ కేంద్రాలే ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1200 మంది ఓటర్లు, పట్టణాల్లో 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 671 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా నూతన ఓటర్లు తక్కువగా నమోదు అయినందున బూత్‌ల సంఖ్య పెరగకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల పోలింగ్‌ బూత్‌లను మార్చే అవకాశం ఉండవచ్చు.
 
 
 
 ఓటర్ల ఫోటోలతో గుర్తింపు కార్డులు రెడీ

No comments:
Write comments