బెజవాడ, విశాఖ కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు

 

విజయవాడ, ఫిబ్రవరి 9, (globelmedianews.com )
విజయవాడ నగర పాలక సంస్థ ఉద్యోగుల ఆశలు ఫలించాయి. 010 జీతాల చెల్లింపుల కోసం ఎంతోకాలం గా ఎదురుచూపులు చూస్తున్న ఉద్యోగులకు క్యాబినేట్ తీపి కబురు ప్రకటించింది.  క్యాబినేట్ సమావేశంలో చర్చోపచర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకోవడంపై వీఎంసీ ఉద్యోగులలో సర్వ త్రా హర్షం వ్యక్తమైంది. ఈ జీవో అమలుతో వీఎంసీకి ఏటా 250 కోట్ల వరకూ ఆర్ధిక భారం తగ్గుతుండగా, ఆ నిధులను నగర అభివృద్ధి కోసం వినియోగించుకునే సౌలభ్యం ఏర్పడింది. ప్రభుత్వం 010 జీతాల చెల్లింపులకు ప్రభుత్వం స్పందించిన వైనం వెనుక మేయర్ కోనేరు శ్రీ్ధర్ చేసిన కృషి నిరుపమానమనే చెప్పాలి. మేయర్ ఎక్కిన గడప, దిగిన గడప అని కాకుం డా మంత్రుల ఆఫీస్‌లకే కాకుండా ఇళ్లకు సైతం వెళ్లి వినతిపత్రాలిచ్చారు. 


 
బెజవాడ, విశాఖ కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు

అలాగే ఎక్కడ ఎవరు కనిపించినా 010 జీవోను ప్రస్తావించి సమస్యను వివరించడమే కాకుండా రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కాళ్లు కూడా పట్టుకుని విన్నవించిన సంద ర్భం ఉందంటే అతిశయోక్తిగా ఉం టుంది. కానీ ఈ ఘటన నూటికి నూ రుశాతం నిజమంటూ గత నెల రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఆయన ప్రసంగిస్తూ వీఎంసీ ఉద్యోగుల కోసం, వీఎంసీ ఆరి ధక అభ్యున్నతి కోసం తాను స్వయంగా మంత్రి యనమల రామకృష్ణుడు కాళ్లు పట్టుకుని విన్నవించానంటూ బహిరంగంగా ప్రకటించారు. మేయర్ శ్రీ్ధర్ చివరికి తన ప్రయత్నంలో విజయం సాధించారన్నది స్పష్టమవుతోంది. గత దశాబ్ధ కాలంగా 010 జీతాల చెల్లింపుల కోసం వీఎంసీ ఉద్యోగులు అనేక ఉద్యమాలు, ఆందోళనలే కాకుండా రోజుల తరబడి విధులను బహిష్కరించి సమ్మె చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో వీఎంసీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 010 జీతాలపై స్పష్టమైన హామీ కూడా ఇవ్వగా, ఈమేరకు మేయర్‌గా పగ్గాలు చేపట్టిన కోనేరు శ్రీ్ధర్ 010 జీతాల అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మినిస్టర్ నారాయణతోపాటు, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర అన్ని విభాగాల మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేశారు. అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ తదితర ఉన్నతాధికారులకు సుమారు 100కు పైగా వినతులందించారనే చెప్పాలి. అదే విధంగా గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా మేయర్ ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ, మంత్రి తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని, రానున్న బడ్జెట్‌లో ఈవిషయాన్ని పొందుపర్చి, క్యాబినేట్ ఆమోదం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని, రానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీఎంసీ ఉద్యోగులకు 010 జీవో ద్వారానే జీతాలందుతాయని, కార్పొరేటర్ల, వీఎంసీ అధికారుల హర్షద్వానాల మధ్య ప్రకటించడం గమనార్హం. అనుకున్న విధంగానే బడ్జెట్ సమావేశాల అనంతరం సమావేశమైన క్యాబినేట్ వీఎంసీ తోపాటు విశాఖ నగర పాలక సంస్థ ఉద్యోగులకు కూడా 010 జీతాలిచ్చేందుకు అమోదం తెలపడం ఉద్యోగులలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలావుండగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇప్పటివరకూ 010 ద్వారా ప్రభుత్వమే జీతాలను చెల్లిస్తుండగా, కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ రెండు కార్పొరేషన్లకు అప్పట్లో 010 జీవో అమలు కాకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వీఎంసీ ఉద్యోగులకు 010 జీవో అమలుచేస్తూ ప్రభుత్వమే వారి జీతాలను చెల్లించేందుకు సమ్మతించడం వీఎంసీలో చారిత్రాత్మక ఘట్టమనే చెప్పాలి. వీఎంసీ ఖజానాలో నిల్వ నగదు లేక 5 నెలలైనా జీతాల చెల్లింపులు జరగని రోజులకు ఇక తెరపడిందనే చెప్పాలి.

No comments:
Write comments