ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు

 

తిరుమల,ఫిబ్రవరి 06: (globelmedianews.com)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది.
 

ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో  ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు

అదేవిధంగా, ఫిబ్రవరి 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోదృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
కాగా, ఫిబ్రవరి 12న రథసప్తమినాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

No comments:
Write comments