హోటల్లో భారీ అగ్నిప్రమాదం…17మంది మృతి

 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (globelmedianews.com):  
రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం  చోటు చేసుకుంది.  కరోల్బాగ్లోని అర్పిత్ ప్యాలెస్ అనే హోటలో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగిసి పడ్డాయి.  దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.  ఈ ప్రమాదంలో  17 మంది  ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు మంటల్లో చిక్కుకున్నారని భావిస్తున్నారు. మృతుల్లో   విశాఖపట్నం  హెచ్ పీసీఎల్ డిప్యూటీ మేనేజర్ చలపతి రావు మృతి చెందారు. 


హోటల్లో భారీ అగ్నిప్రమాదం…17మంది మృతి

పెట్రోటెక్ సదస్సుకు హాజరయ్యేందుకు అయన ఢిల్లీకి వచ్చారు. తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా మంటలు అలుముకున్నాయి. పై అంతస్థుల్లో  మొదలయిన క్షణాల్లో మంటలు వ్యాపించడంతో  ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. సిబ్బంది ఫిర్యాదు మేరకు  సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 ఫైరింజన్లతో  మంటలను ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అదుపు చేసారు. మంటలు వ్యాపించగానే, భవంతి నుంచి బయట పడేందుకు పలువురు కిటికీల నుంచి, టెర్రస్ నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో ఓ మహిళ, చిన్నారి మరణించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నామని ప్రకటించింది.

No comments:
Write comments