సన్నబియ్యానికి రూ.35.90

 

నిజామాబాద్, ఫిబ్రవరి 14, (globelmedianews.com)
ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించే సన్నబియ్యం కొనుగోలులో పౌరసరఫరాల సంస్థ రైస్‌ మిల్లర్లతో జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. గత ఏడాది సరఫరా చేసిన ధరకే ఈ ఏడాది కూడా సన్నబియ్యం సరఫరా చేయడానికి రైస్‌ మిల్లర్లు అంగీకరించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు , మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. 


సన్నబియ్యానికి రూ.35.90

ఇందుకోసం ఏడాదికి 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అవసరం అవుతుంది. ఈ బియ్యం కొనుగోలుకు సంబంధించి టెండర్లు నిర్వహించగా తుది రేటు కిలోకు రూ. 35.90 కోట్‌ చేశారు. ఈ ధర అధికమని భావించిన శ్రీనివాస్‌రెడ్డి, అకున్‌ సబర్వాల్‌ రైస్‌మిల్లర్లతో సంప్రదింపులు జరిపారు. గత ఏడాది సరఫరా చేసిన ధరకే ఈసారి కూడా సరఫరా చేయాలని రైస్‌ మిల్లర్లను ఒప్పించారు. దీని వల్ల పౌరసరఫరాల సంస్థకు రూ. 37 కోట్లు ఆదా కానుంది. గతేడాది తొలి మూడు నెలలకు గాను 36 వేల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం  క్వింటాల్‌ రూ. 33.50, ఆ తరువాత తొమ్మిది నెలలకు గాను 84 వేల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం  క్వింటాల్‌ రూ. 32.50కి సరఫరా చేశారు. గతంలో మాదిరిగానే సరఫరాకు సంబంధించి అవసరమైన గన్నీ సంచులను కూడా రైస్‌ మిల్లర్లే సమకూర్చుకుంటారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నది. పథకాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో తమ వంతు సామాజిక బాధ్యతగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అదే ధరకు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది

No comments:
Write comments