రెండు వేల 700 కోట్ల కోత ఎక్కడిదీ

 

ఏలూరు, ఫిబ్రవరి 13, (globelmedianews.com)
పోలవరం ప్రాజెక్టు సవరణ ప్రతిపాదనలకు ప్రాజెక్టు సాంకేతిక సలహా మండలి ఆమోదించిన మొత్తంలో ఎక్కడ కోత పడిందనేది సందిగ్ధంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం రూ.58,319 కోట్లు కావాల్సి ఉంటుందని ప్రతిపాదించగా రూ.55,557 కోట్లకు అనుమతి తెలిపింది. మిగిలిన రూ.2,762 కోట్లు ఎక్కడ కోత పెట్టారనేది స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం ప్రాజెక్టుల్లోనే పెరుగుదల ఎక్కువగా ఉందని జలనవరులశాఖ అధికారులు చెబుతున్నారు. 


రెండు వేల 700 కోట్ల కోత ఎక్కడిదీ

కోత అనేది కూడా దీనికే ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుండో అంచనాలు పెంచాలని కోరుతోంది. 2005-05 అంచనా విలువ ప్రకారం రూ.10, 151.04 కోట్లుగా ఉండగా 2010 నాటికి 16,010 కోట్లకు పెరిగింది. 2013-14 నాటికి 58,319.06 కోట్లకు చేరుకుంది. దీనికి అప్పటి ప్రభుత్వం అనుమతివ్వలేదు. విభజన అనంతరం భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం సమస్యగా ఉందని, వెంటనే నిధులకు మంజూరు తెలిపితే ఇబ్బంది ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుశాఖకు నివేదిక పంపింది. కేంద్రం దీన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాల పెంపు అంశాన్ని పక్కనబెట్టింది. దీనివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్రం మరోసారి నివేదిక పంపించింది. ఈ లోపు కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీని నియమించి దాని ద్వారానే ఖర్చు చేయాలని పేర్కొంది. పెరుగుదల వల్ల తాము పనులు చేయలేకపోతున్నామని పేర్కొంది. దీనిపై పోలవరం అథారిటీ పరిశీలన చేసి చెబుతామని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దఫదఫాలుగా వివరాలు సమర్పించింది. పెరుగుదలకు సంబంధించి పునరావసంలో 2005లో రూ.1893 కోట్లుగా అంచనా వేశారు. 2010లో సవరించిన అంచనాల్లో రూ.2934 కోట్లుగా పేర్కొన్నారు. 2014లో ఈ అంచనాలు రూ.33,858 కోట్లకు చేరాయి. అంటే సుమారు తొలి అంచనాలకు చివరి అంచనాలకు రూ.30,924 కోట్లు పెరిగింది. 1053 శాతం పెరుగుదల ఉందని, భూమి ధరలు ఇంతగా పెరగనప్పుడు అంచనాలు ఎలా పెరుగుతాయని పిపిఏ ప్రశ్నించింది. అప్పట్లో ప్రాజెక్టుకు సంబంధించి ఏడు గ్రామాలనే పేర్కొన్నారని, అనంతరం ఏడు మండలాలు వచ్చి చేరాయని అందువల్లే సమస్య ఉత్పన్నమైందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సవరించిన అంచనాల్లో ఎందులో కోత విధించిందనేది పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందితేగానీ తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పునరావాసం, పునర్నిర్మాణంపై చూపడం లేదు. పునరావాసంలోనూ 94370 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. దీనిలో గనుక కోత పెడితే ఎక్కువగా నష్టపోయేది గిరిజనులేనని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు కింద 1.62 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇంకా 55 వేల ఎకరాల వరకూ సేకరించాల్సి ఉందని చెబుతున్నారు. 

No comments:
Write comments