వైసిపి ఎమ్మెల్యేలకు ఓటేస్తే కడపొళ్ల రౌడీయిజం

 

మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి 
నెల్లూరు, ఫిబ్రవరి 12: (globelmedianews.com)  
వైసిపి ఎమ్మెల్యేలకు ఓటేస్తే కడప గుండాలు ఇక్కడ రౌడీయిజం చేస్తారని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి విమర్శించారు 32 వ డివిజన్ లోని టైలర్స్ కాలనీ లో మంగళవారం జరిగిన పసుపు కుంకుమ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడుండే ఇద్దరు ఎమ్మెల్యేలు రౌడీ లే నాయకుల ను రాత్రిళ్లు బెదిరిస్తారు కొన్ని సందర్భాల్లో ఆడ వాళ్లకు కూడా ఫోన్ చేసి బెదిరించే వ్యవహారం ఇప్పుడు కొత్తగా మొదలైందని ఆరోపించారు ఈ పరిస్థితుల్లో మీకు రౌడీలు కావాలో మంచి వాళ్ళు కావాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు .వైసిపి ఎమ్మెల్యేలకు ఓటేస్తే కడపొళ్ల రౌడీయిజం

తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందనే బాధతో మేము నిర్వహించే సమావేశాల్లో ఒకరిద్దరిని పంపి చెడగొట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు అయినప్పటికీ వారి ఆటలు సాగవని స్థానికులు వారికి బుద్ధి చెబు థున్నారని తెలిపారు నెల్లూరు జిల్లాలో ని లేగుంటపాడు లో ప్రారంభమైన పొదుపు ఉద్యమాన్ని చంద్రబాబు పెంచి పోషించారని తద్వారా మహిళల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు ఏ ప్రభుత్వమైనా మహిళల నిర్ణయ మీదనే నిర్మితమవుతుంద ని పేర్కొన్నారు 32 వ డివిజన్ లో సిసి రోడ్లకు నాలుగు కోట్లు మంజూరు చేశామని ఇంకో రెండు నెలల్లో అవి పూర్తవుతాయని తెలిపారు గతంలో నెల్లూరులో ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగింది లేదని తెలిపారు గతంలో ఈ ప్రాంతంలో ఒక స్కూలు కూడా మంజూరు చేసి పూర్తి చేశామని చెప్పారు గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు అభివృద్ధి అనేది నిరంతరంగా జరగాల్సిన అవసరముందని అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు చంద్రబాబు కట్టించిన పక్కా గృహ సముదాయాలు రుణ మొత్తాన్ని రద్దు చేయమని కోరితే త్వరలో ఆ నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారని తెలిపారు ఆ నిర్ణయం సానుకూల మవుతుందని దాని వల్ల పేద వారికి లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంత అభివృద్ధికి కారణమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబును అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఖాజావలి హరి బాబు యాదవ్ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య కమలాకర్ రెడ్డి జెన్నీ రమణయ్య రాఘవప్ప నాయుడు కార్పొరేటర్ రాజేష్ సుధాకర్ యాదవ్ పాశం శ్రీనివాసులు పాముల హరి అవినాష్ గంగాధర్ పరదేశి రఘు నరసింహ రావు పార్థసారధి కరీముల్లా హరిశ్చంద్ర రెడ్డి అన్నం దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments