లవర్స్‌ డే రివ్యూ

 

తారాగణం: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌.., త‌దిత‌రులు
మ్యూజిక్: షాన్ రెహ‌మాన్‌
ప్రొడ్యూసర్స్: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి
స్టోరీ, డైరెక్షన్: ఒమ‌ర్ లులు 
ఒక్క కన్ను గీటి ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియాప్రకాష్ మెయిల్ రోల్ లో వచ్చిన మలయాళ సినిమా ఒరు అడార్ లవ్ సినిమా. సినిమాలోని ప్రియాప్రకాష్ కన్ను కొట్టడం.., గన్న పేల్చి ముద్దుపెట్టడం లాంటి సీన్లతో సినిమా బాగా పాపులర్ అయింది. అదే సినిమా లవర్స్ డే పేరుతో తెలుగులోకి డబ్ అయింది. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ ఫస్ట్ మూవీ సక్సెస్ అయిందా..? లేదా..? రివ్యూ చూద్దాం..


లవర్స్‌ డే రివ్యూ

స్టోరీ: ఇంట‌ర్మీడియట్  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీ ఇది. రోష‌న్ (రోష‌న్‌), ప్రియా (ప్రియా వారియ‌ర్‌), గాథ జాన్ (నూరిన్ షెరిఫ్‌), మాథ్యూ (మాథ్యూ జోసెఫ్‌), ప‌వ‌న్ (వైశాఖ్ ప‌వ‌న‌న్)....వీళ్లంతా ఫ్రెండ్స్. క్లాస్ మేట్స్ కూడా. వీళ్ల‌లో రోష‌న్‌, ప్రియా తొలి చూపులోనే లవ్ లో పడతారు. ఇద్దరి లవ్ కు గాథ హెల్ప్ చేస్తుంది. అదే టైమ్ లో కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో వీళ్లిద్దరి గురించి ఒకే చర్చ నడుస్తుంది. దీంతో ఇద్దరూ విడిపోతారు. వీళ్లిద్దర్నీ కలిపేందుకు వారి ఫ్రెండ్స్ బ్యాచ్ ఓ ప్లాన్ వేస్తుంది. వేరే అమ్మాయితో చనువుగా ఉంటే ప్రియాలో మార్పొస్తుందని ఫ్రెండ్స్ సలహా ఇస్తారు. దీంతో రోషన్-గాథ లవ్ చేసుకుంటున్నట్లు నటిస్తారు. ఐతే ఇద్దరు నిజంగానే ప్రేమలో పడతారు. మరి ఈ ట్రయింగిల్ లవ్ స్టోరీకి ఏ విధంగా శుభంకార్డ్ పడిందేని తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉంది?: కాలేజ్‌లో ఉండే సరదాలు.. ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎట్రాక్షన్ మెయిన్ థీమ్ గా సాగే సినిమా ఇది.  ఈ జానర్ సినిమాలు టాలీవుడ్ లో కొత్తేంకాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.., కాలేజ్ ఫ్రెషర్స్ డే, యాన్యువల్ డేతో ఫస్ట్ సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా లవ్ బ్రేక‌ప్‌, మ‌ళ్లీ కొత్త‌గా ప్రేమించుకోవడం వంటి సీన్లతో సాగుతుంది.
క్లైమాక్స్ మినహా సినిమాలో కొత్తదనం ఏమీ లేదు.  ప్రియా వారియ‌ర్ క‌న్నుకొట్టే స‌న్నివేశం  సంచ‌ల‌నంగా మారిన త‌ర్వాత ఈ సినిమా క‌థ మారిపోయింది. స్టోరీలో ఆమెకు ప్రాధాన్యతత పెరిగింది. ఆమె పాత్రను మరింతగా పెంచారు. దీంతో స్టోరీ గాడి తప్పింది. లవ్ స్టోరీలో ఎమోషన్స్ ఎంత కీలకమో దర్శకుడు గుర్తించలేకపోయాడు. పస్ట్ హాఫ్ లో అసలు స్టోరీనే చెప్పకుండా ప్రియా-రోషన్ల మధ్య లవ్ సీన్స్ ను సాగదీశారు. కొంతవరకు డ్రామా పండినా అవి సినిమాకు ఏమాత్రం ప్లస్ అవలేదు. 
ఎలా చేశారు?: రోష‌న్‌, ప్రియా, నూరిన్ షెరిఫ్  రోల్సే సినిమాలో కీలకం. ప్రియా ప్రకాషే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఐతే మరో హీరోయిన్ నూరిన్ షెరిఫ్ కూడా సినిమాలో త‌న అందంతో ఆకట్టుకుంది. ప్రియాకి దీటుగా షెరిఫ్ కనిపించింది.  న‌ట‌నప‌రంగా కూడా ఆమె ఆకట్టుకుంది. రోష‌న్ న‌ట‌న‌ రొటీన్ గా ఉంది.ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ ఫర్వాలేదు.డబ్బింగ్ మాత్రం అస్సలు సెట్  అవలేదు.
ప్లస్ పాయింట్స్
+ ప్రియా, నూరిన్ షెరిఫ్‌ల గ్లామర్ 
+ సాంగ్స్
+ క్లైమాక్స్
బ‌లహీన‌త‌లు:
-  రొటీన్ స్టోరీ 
- ఫస్ట్ హాఫ్

No comments:
Write comments