అద్బుతమైన ఫలితాలు సాధించాం

 

అమరావతి, ఫిబ్రవరి 04 (globelmedianews.com
అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడరాదు. నాలుగున్నరేళ్లుగా అద్భుతమైన ఫలితాలు సాధించాం. ప్రజాదరణ పథకాలపై సానుకూలత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు అయన  ‘నీరు-ప్రగతి’ పై సీఎస్ పునేటా తో కలసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు అధికారులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ చిన్న పొరపాటు జరిగినా చేసిన మంచి పోతుంది. కేంద్రం వైఫల్యాలతో రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయి. నరేగా, పోలవరానికి నిధుల విడుదలలో తీవ్రజాప్యం. అభివృద్ధి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డంకులు వున్నాయని అన్నారు. అయినా రాజీపడకుండా ముందుకు పోతున్నాం. 9వ తేదీన 4లక్షల గృహప్రవేశాలు విజయవంతం చేయాలి. పించన్ల పెంపు, పసుపు-కుంకుమ 2కు అపూర్వ ప్రజాదరణ లభించింది. రెండురోజుల్లో 24లక్షల మందికి పించన్ల పంపిణీ. మిగిలినవారికి ఈ రోజు పంపిణీ చేస్తాం.  8వ తేదీ వరకు పించన్ల పంపిణి జరుగుతుంది.


అద్బుతమైన ఫలితాలు సాధించాం

పించన్ల పండుగ విజయవంతం చేసిన అందరికీ అభినందనలని అన్నారు. చెక్కుల మార్పిడిలో బ్యాంకర్లు సహకరించాలి. ఆర్ధిక శాఖ రూ.4,100కోట్లు విడుదల చేసింది. బ్యాంకుల్లో రూ.2350కోట్లు డిపాజిట్ చేశాం. నగదు చెల్లింపులో మహిళలను ఇబ్బందులు పెట్టకూడదని అన్నారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి.  జొన్న,మొక్కజొన్న రైతులకు చెల్లింపులు జరపాలి. ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  మిక్సింగ్ ప్లాంట్లపై నిఘా ముమ్మరం చేయాలి. గత ఏడాదికన్నా రిజర్వాయర్లలో నీటి మట్టం 6% తక్కువ. సమర్ధ నీటి నిర్వహణ జరపాలని అన్నారు. రబీ సీజన్ లో 87% మాత్రమే సాగు జరిగింది. పంట దిగుబడులు తగ్గకుండా శ్రద్దపెట్టాలి. కరవు మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలి. పనిదినాలు మెరుగుపరచాలి. రాబోయే ఎన్నికలు మనందరికి ఫైనల్ పరీక్షలు.  ఐదేళ్ల మన కృషికి ఈ పరీక్షా ఫలితాలే గీటురాయని అన్నారు. సుప్రీం న్యాయమూర్తుల ప్రశంసలు మన కృషికి గుర్తింపని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే 6నెలలు పనిచేయాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.

No comments:
Write comments