నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు

 

నెల్లూరు, ఫిబ్రవరి 9 (globelmedianews.com
ఏపీలో ప్రభుత్వం నిర్మించిన నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు  జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొని ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 17,117 ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం, ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు దీటుగా వీటిని నిర్మించామని, ఆధునిక పరిజ్ఞానంతో జీ ప్లస్ 3 విధానంలో ఇళ్లు నిర్మిస్తున్నామని, అవసరమైతే అపార్టు మెంట్లలో లిఫ్ట్ లు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. కమర్షియల్ ప్రదేశం, పాఠశాల, పార్కులు, అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణానికి ఏడు రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నామని, డబ్బులున్న తెలంగాణ రాష్ట్రం, పక్కనే ఉన్న కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఇన్ని ఇళ్లు కట్టలేదని గుర్తుచేశారు.


నాలుగు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు

పేదవాడి ముఖంలో ఆనందం చూసేందుకే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. భావి తరాల కోసం టీడీపీని గెలిపించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. నెల్లూరులో జరుగుతున్న సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిపించారని, ఈసారి మొత్తం పదికి పది స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఇక్కడి అభ్యర్థుల ఎంపికను చాలా జాగ్రత్తగా చేస్తానని, ఓటు వేసే ముందు చంద్రన్న చేసిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు చేశారు. రాజకీయాలు చాలా దుర్మార్గంగా తయారయ్యాయని, వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని, పార్లమెంటుకు వెళ్లరని, మోదీని నిలదీయాల్సి వస్తుందని ఇంట్లోనే ఉంటారని విమర్శించారు. అసెంబ్లీకి రాని వైసీపీ నేతలు జీతాలు మాత్రం  ఠంచన్ గా తీసుకుంటారని సెటైర్లు విసిరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధిలో మనతో పోటీ పడలేరని, ఈ రాష్ట్రం నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.5 వేల కోట్లు ఇవ్వడం లేదని విమర్శించారు.చరిత్రలో ఎప్పుడూ జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏపీలో తీసుకువచ్చామని, వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.25 వేల కనీస ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. పేదరికం లేని సమాజం నిర్మించడమే తన లక్ష్యమని, చిన్న ఉద్యోగులకు కూడా జీతాలు బాగా పెంచామని, పోలీసు శాఖలో 3,500 మందికి పదోన్నతులు కల్పించామని, రూ. 200 ఉన్న పింఛన్ ని రెండు వేల రూపాయల చేశామంటే అది ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 39,169 గృహాలను, పట్టణ ప్రాంతాల్లో 13,844 ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందిస్తారు. ఏపీ అంతటా ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర కాలనీలో 4,800 ఇళ్లను చంద్రబాబు ఈరోజు ప్రారంభించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇప్పటికే అమరావతి నుంచి నెల్లూరుకు బయలుదేరారు. ఈ ఇళ్లను అపార్ట్ మెంట్ల తరహాలో షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించారు

No comments:
Write comments