మాస్టర్ మైండ్ దగ్గుబాటి వ్యూహాంపై ఆసక్తి

 

ఒంగోలు, ఫిబ్రవరి 5, (globelmedianews.com) 
దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన తన కుమారుడు హితేశ్ చెంచురామ్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు సిద్ధమయ్యారు. రేపో, మాపో పార్టీ కండువాను హితేశ్ కప్పుకోనున్నారు. తన సొంత నియోజకవర్గం, ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం ఉన్న పర్చూరు నియోజకవర్గం నుంచే హితేశ్ రాజకీయ అరంగేట్రం చేయించాలని తండ్రి వెంకటేశ్వరరావు తాపత్రయం. అందుకోసమే సతీమణి పురంధ్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నా ఆయన నేరుగా జగన్ ను కలసి తన అభిలాషను వ్యక్తం చేశారు.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వైసీపీ అయితేనే బెటర్ అని భావించిన దగ్గుబాటి కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీ ప్లాట్ ఫాం ను ఎంచుకున్నారన్నది వాస్తవం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దగ్గుబాటి కుటుంబం పార్టీలో చేరితే తమకు అన్ని విధాలుగా లాభమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. 


మాస్టర్ మైండ్ దగ్గుబాటి వ్యూహాంపై ఆసక్తి

తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి కుటుంబంలో ముఖ్యులు పార్టీలోకి తీసుకురావడం అధికార పార్టీ మీద తొలి విజయం సాధించినట్లేనని అభిప్రాయపడుతుంది. తమకు కూడా దగ్గుబాటి రాకతో కేవలం ప్రకాశం జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎఫెక్ట్ పడుతుందని వైసీపీ భావిస్తోంది.దగ్గుబాటి ఫ్యామిలో నుంచి పురంద్రీశ్వరి కూడా వైసీపీలోకి వస్తారని భావించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అవసరమైతే పురంద్రీశ్వరి రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రకటించారు. కాని ఇందుకు విరుద్ధంగా పురంద్రీశ్వరి తాను బీజేపీలోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా యువమోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. మ్యేనిఫేస్టో కమిటీ కన్వీనర్ గా ఉన్నారు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పురంద్రీశ్వరి నమ్ముతున్నారు. అంతేకాదు ఏపీలో పోటీ చేసి ఓటమి పాలయినా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపుతామని ఆమెకు పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి హామీ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీ కోటాలో తనకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. అందుకోసమే తాను బీజేపీలోనే కొనసాగుతానని పురంద్రీశ్వరి స్పష్టం చేశారు. ఇటు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కుమారుడి భవిష్యత్తు బాగుంటుందని, తాను కూడా కేంద్రంలో కీ రోల్ పోషించవచ్చని పురంద్రీశ్వరి భావిస్తున్నారు. అందుకే దగ్గుబాటి చెప్పినట్లుగా…తాను రాజకీయాల నుంచి తప్పుకోనని, బీజేపీలోనే కొనసాగుతానని చెబుతున్నారు. మరి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ ను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.

No comments:
Write comments