ఎన్నికల సమాచారానికి టోల్ ఫ్రీ నెంబర్

 

ప్రారంభించిన జిల్లా కలెక్టర్ 
సిద్ధిపేట, ఫిబ్రవరి 04: (globelmedianews.com)
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఎన్నికలకు సంబంధించిన 1950 టోల్ ఫ్రీ నెంబరు, జిల్లా ఎన్నికల కాల్ సెంటరును డీఆర్వో చంద్రశేఖర్ తో కలిసిజిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి  సమాచారాన్ని అయిన ఈ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుని, జిల్లా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. 


ఎన్నికల సమాచారానికి టోల్ ఫ్రీ నెంబర్  

ఓటరు నమోదు సమాచారం, ఎన్నికల  ఫిర్యాదులు, ఓటరు నమోదుతో సవరణలు, ఓటు హక్కు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకునేలా., అలాగే ఓటు బదిలీ, మార్పులు, చేర్పులు, నూతన ఓటరు నమోదు వంటి అంశాలు, మార్పులు చేర్పులకు ఈ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ టోల్ ఫ్రీ 1950 నెంబరుకు వచ్చిన కాల్స్ లో మాట్లాడి ట్రయల్ రన్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు గణేశ్, డిస్ట్రిక్ట్ ఈ మేనేజర్ ఆనంద్ కుమార్, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments