మళ్లీ రాఫెల్ వార్..

 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (globelmedianews.com)
కాపాలాదారుడే దొంగ అన్న నిజం మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ర‌ఫేల్ ఒప్పందంపై ఆంగ్ల దిన‌ప‌త్రిక ద హిందూ ప్ర‌చురించిన క‌థ‌నంపై రాహుల్ స్పందించారు. పీఎంవో కార్యాల‌యం ర‌ఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌తో స‌మాంత‌ర సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు ఆ క‌థ‌నం వెల్ల‌డించింది. అయితే సుప్రీంకోర్టుకు ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌లేద‌ని రాహుల్‌ అన్నారు. ర‌ఫేల్ డీల్‌పై ఇటీవ‌ల ప‌దేప‌దే ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు చేస్తున్న రాహుల్‌కు ఇప్పుడు మ‌రో ఆయుధం దొరికిన‌ట్లు అయ్యింది. 


మళ్లీ రాఫెల్ వార్..

ప్ర‌ధాని మోదీ ఆ డీల్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారో తెలుసా. అది మీకోసం కాదు, నా కోసం కాదు, అది కేవ‌లం అనిల్ అంబానీ కోస‌మ‌ని, అంటే చౌకీదారే దొంగ అన్న విష‌యం మ‌రోసారి రుజువైంద‌ని రాహుల్ అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ర‌ఫేల్‌పై ఎందుకు స‌మాంత‌ర సంప్ర‌దింపులు జ‌రిపింద‌ని ప్ర‌శ్నించారు. కావాలంటే కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఎవ‌రినైనా మోదీ ద‌ర్యాప్తు చేయ‌వ‌చ్చు అని, కానీ ర‌ఫేల్ స్కామ్‌పైన కూడా ప్ర‌ధాని ద‌ర్యాప్తు చేయాల‌న్నారు. డిఫెన్స్ సెక్ర‌ట‌రీ వ‌ద్ద‌న్నా.. పీఎంవో ఎందుకు జోక్యం చేసుకుంద‌ని ప్ర‌శ్నించారు. గురువారం పార్ల‌మెంట్‌లో ర‌ఫేల్ అంశంపై ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఒక్క డిఫెన్స్ డీల్ కూడా నిజాయితీగా జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శించారు. ర‌క్ష‌ణ ద‌ళాల‌ను కాంగ్రెస్ చిన్న‌చూపు చూసింద‌న్నారు. 

No comments:
Write comments