టెక్నాలజీతో దగ్గరవుతున్న పోలీసులు

 

మెదక్ , ఫిబ్రవరి 12, (globelmedianews.com)
ప్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేసిన సర్కార్ ... ఆ  దిశగా అడుగులు ప్రారంభించింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది.మెదక్  కేంద్రంగా ఆవిర్భవించిన మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, అల్లాదుర్గం, సర్కిల్ కార్యాలయాలు ఉండగా మెదక్, తూప్రాన్ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 20 మండలాల్లో పాటు మెదక్ మున్సిపాలిటీలలో 21 పోలీస్‌స్టేషన్‌లు ఉన్నాయి. జిల్లాలో 44,101 జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 


 టెక్నాలజీతో దగ్గరవుతున్న పోలీసులు

నేరాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణా జిల్లాలోని మంజీరా, హల్దీ పరివాహక ప్రాంతాలతో పాటు నర్సాపూర్‌లోని అటవీ ప్రాంతాల గుండా జోరుగా సాగుతున్నది. గ్రామాల్లో బెల్టు దుకాణాలు, కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ పేకాట, మట్కా, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ పోలీసు సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా గొడవ జరిగిందని తెలిస్తే పోలీసు సిబ్బంది బాధితుల పక్షాన కాకుండా అక్రమార్కుల పక్షాన నిలబడుతారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయాలలో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. తమ శాఖపై ఉన్న అప్రతిష్టను తొలగించేందుకు మెదక్ పోలీస్ ప్రజాపోలీస్‌గా పేరు తెచ్చేందుకు ఎస్పీ పలు నిర్ణయాలను తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌ను కలిగి ఉండడం సాధారణ విషయంగా మారింది. సామాజిక మాద్యమాల వినియోగం కూడా పరిపాటిగా మారింది. దీంతో మారుమూల గ్రామాలలోని సమస్యలు, విశేషాలు సైతం అర సెకను కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు పోలీసు శాఖ వాట్సప్ నం. 73330671900కు తమ సమస్యలను ఆధారాలతో సహా తెలిపితే వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. వీటితో పాటు ఎస్పీ మెదక్ అనే పేరుతో ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

No comments:
Write comments