గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్

 

వరంగల్, ఫిబ్రవరి 9, (globelmedianews.com)
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను సిద్దం చేస్తుంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. దీటైన అభ్యర్థ్ధులను బరిలో నిలుపాలని భావిస్తుంది. ఈ నెలాఖరు కల్లా అభ్యర్థ్ధులను ఖరారు చేసే విధంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షేత్ర స్థాయిలో కసరత్తులు ప్రారంభించారు. యువకులకు, అనుభవజ్ఞులకు పెద్దపీట వేసే విధంగా కసరత్తులు జరుగుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వరంగల్ లోక్ సభ, మహబూబాబాద్ లోక్ సభ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అభ్యర్ధుల ఎంపికకు కసరత్తులు జరుగుతున్నాయి. 


గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్

వరంగల్ పార్లమెంట్ బరిలో మాజీ ఎంపీ గుండె విజయరామరావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మంద కృష్ణ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది. అదే విధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో దించేందుకు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బెల్లయ్య నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో జాప్యం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఇటీవల ఆ పార్టీ నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. తిరిగి అదే తప్పును మరోసారి జరగకుండా చూడాలని అనే ఉద్దేశంతో ముందస్తుగా పార్లమెంట్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఈ సారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే రంగంలోకి దింపాలనే భావిస్తే మంద కృష్ణ మాదిగతోపాటు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు అవకాశం దక్కనుంది. అయితే మాజీ మంత్రి విజయరామరావు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఆయన గతంలో ఎంపీగా, మాజీ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నారనే పేరుంది. అదే విధంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థ్ధిగా మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌తో పాటు రవీంద్రనాయక్, బెల్లయ్యనాయక్‌లు ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బలరాం నాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి

No comments:
Write comments