బాబు ఇగో హార్ట్ చేసిన మోడీ

 

గుంటూరు, ఫిబ్రవరి 11 (న్యూస్ పల్స్)
వరుసగా ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు చేతకాదు. ఈ మాట అన్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని ఈ ఒక్క వ్యాఖ్య పలు అర్ధాలు స్ఫురింప చేసేలా చేస్తుంది. దేశంలో అందరికన్నా తానే సీనియర్ అని కరుణానిధి, వంటి పలువురు సీనియర్లు బతికుండగానే చంద్రబాబు స్వయం ప్రచారం సాగించారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ కరుణానిధి మరణం తరువాత ఏర్పాటైన ఆయన సంస్మరణ సభలో ఆయనే సీనియర్ అని ఒప్పుకున్నారు బాబు.


 బాబు ఇగో హార్ట్ చేసిన మోడీ

 ఈ విషయం పక్కన పెడితే మోడీ కన్నా తానే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు మోడీ మామూలు గా చురకలు అంటించలేదు. గుంటూరు సభలో ఎపి సీఎం సీనియారిటీపై మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్చల్ గా మారాయి.చంద్రబాబు నాకన్నా సీనియర్. నిజమే ఆయన ఎన్నికల్లో వరుసగా నెగ్గడం చేతకాదు కానీ నాకన్నా సీనియర్ నే అంటూ గుజరాత్ ముఖ్యమంత్రిగా అపజయం ఎరుగని ముఖ్యమంత్రిగా తన ప్రతిభను పరోక్షంగా చెప్పుకున్నారు ప్రధాని. ఇదే వ్యాఖ్యలో ఇంకో అర్ధాన్ని కూడా ధ్వనింప చేశారు. వరుసగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్టీఆర్, వైఎస్సాఆర్, కేసీఆర్ వంటి వారితో ఇన్ డైరెక్ట్ గా పోల్చి తమరేమి తోపు కాదన్న రీతిలో తీసిపారేశారు మోడీ.ఇంతకుముందు పార్లమెంట్ లో జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగానూ ఒక్క మాటలోనే టిడిపి నేతను అవమానించారు మోడీ. తెలంగాణ సిఎం ఎంతో విజ్ఞతతో పాలన చేస్తుంటే ఎపి ముఖ్యమంత్రి వైసిపి పన్నిన వలలో చిక్కుకుని బిజెపికి దూరం అయ్యారని తీసిపారేశారు. తాజాగా కూడా మరోసారి చంద్రబాబు ఇగోను గట్టిగానే దెబ్బతీశారు ప్రధాని. అదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడం గమనార్హం

No comments:
Write comments