డీఎల్ కు లైన్ క్లియర్

 

కడప, ఫిబ్రవరి 11, (globelmedianews.com)
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి. అందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన స్థానాలపై జగన్ ఎక్కువ ఫోకస్ చేశాడు. అయితే, తన సొంత జిల్లాను మాత్రం లైట్ తీసుకున్నారు. ఇప్పుడిదే వైసీపీకి మైనస్‌గా మారబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పదమూడు జిల్లాల్లో కడపను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెబుతారు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు ఆ జిల్లా ఓటర్లు. అందుకే అక్కడ వైఎస్ కుటుంబానికి ఎదురులేకుండా పోయింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీకి ఈ జిల్లాలో మంచి ఫలితాలే వచ్చాయి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ తొమ్మిదింటిని కైవశం చేసుకుంది.గత ఎన్నికలకు ఇప్పటికీ అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  డీఎల్ కు లైన్ క్లియర్

వచ్చే ఎన్నికల్లో కడపలో సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ.. అక్కడ అభివృద్ధి పథకాలతో ప్రజల్లో మంచి పేరును సంపాదించుకుంటుంది. కడపలో చేస్తున్న అభివృద్ధి వల్ల వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుండడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే జగన్ సొంత జిల్లాపై ఎక్కువ దృష్టి సారించారు. ఇందులో భాగంగానే అదే జిల్లా నుంచి గతంలో పలుమార్లు విజయం సాధించి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేశారట.కడప జిల్లాలోనే కాకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందుకు గానూ ఆయనకు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసిందట టీడీపీ అధిష్టానం. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఐదు సార్లు విజయం సాధించారు. విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉండడంతో 2014 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్‌కు సీఎం టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. పుట్టా ఈ ఎన్నికల్లో తనకే టికెట్ అని గట్టిగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో ఈసారి గట్టెక్కొచ్చన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా పుట్టాకే టికెట్ దక్కుతుందని ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయనే డైరెక్టుగా రంగంలోకి దిగారని తెలిసింది. అధినేత మాత్రం మైదుకూరు అభ్యర్థిగా డీఎల్‌ అయితేనే బాగుంటుందని, అందుకే ఆయన వైపు మొగ్గు చూపారని సమాచారం. ఇందుకోసం పుట్టా సుధాకర్‌తో ఆయన సమావేశమయ్యారట. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పుట్టా కూడా చంద్రబాబు మాటకే గౌరవమిస్తానని చెప్పారనే టాక్ వినిపిస్తోంది. దీంతో మాజీ మంత్రి ఫిబ్రవరి 20 లోపు సైకిల్ ఎక్కడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:
Write comments