టాలీవుడ్ లో సోషల్ వార్

 

టాలీవుడ్ లో సోషల్ వార్
హైద్రాబాద్, ఫిబ్రవరి 6, (globelmedianews.com)
టాలీవుడ్‌లో మరో వివాదం నడుస్తోంది. ఇటీవల ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఈ ఇష్యూలోకి మెగాబ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చి వివాదాన్ని మరింత రాజేశారు. ఆడవాళ్ల వస్త్రధారణ గురించి మాట్లాడటానికి అసలు వీళ్లెవరు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు నాగబాబు. ఈ ఇష్యూలో అటు నాగబాబుని ఇటు బాల సుబ్రహ్మణ్యంని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఈ సందర్భంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ.. జబర్దస్త్ జడ్జ్ మెగా బ్రదర్ నాగబాబుకి సపోర్ట్‌గా నిలిచారు. ‘ఈ సమయం నాగబాబుది ఆయన్ని గౌరవిస్తున్నా..’ అంటూ నాగబాబు మహిళ వస్త్రధారణకు మద్దతుగా నిలుస్తూ రూపొందించిన వీడియోను షేర్ చేసింది అనసూయ. అసలు బాలసుబ్రహ్యణ్యం ఏమన్నారంటే.. ‘వేదిక మీద ఓ స్త్రీ పాత్రధారిణి వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనే నిర్ణయం కూడా తీసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా? లేక మరొకటి అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తరువాత అక్కడకి వచ్చిన హీరోలు, నిర్మాతలు మనకు అవకాశాలు ఇస్తారని అనుకునే పరిస్థితికి మన సంస్కారం కిందికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని నేను గట్టిగానే చెప్పదలుచుకున్నా.. నాకేం ఇబ్బంది లేదు.టాలీవుడ్ లో సోషల్ వార్ 
 
నా మీద హీరోయిన్స్ కోప్పడినా ఇబ్బంది లేదు. బహుషా వాళ్లకు తెలుగు తెలియదు కాబట్టి ఇది అర్ధం కాదు. ఎవరైనా డబ్బు సంపాదించాలనే సినిమా చేస్తారు. కాని దాని వెనుక ఒక నిబద్ధత, బాధ్యత, సమాజం పట్ల ఒక స్పృహ ఉండాలంటూ చురకలు అంటించారు ఎస్ పి బాలు. నాగబాబు ఘాటు స్పందన ఇదీ.. ‘అసలు ఆడవాళ్ల డ్రెస్ గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. సాంప్రదాయం, మతం ముసుగులో కూర్చుని ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకూడదని చెప్తారా.. అలాంటి డ్రెస్‌ల వల్ల మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అంటారా.. మగవాడి కామదృష్టికి నీచమైన ఆలోచనకి శరీరాన్ని కప్పుకున్నా.. ఎక్స్‌పోజ్ చేసినా వాడి బుద్ది మారదు. అలాంటి వాళ్లకోసం మీరు డిక్టేట్ చేస్తారా? పలానా హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది. క్యారెక్టర్ కోసం ఎట్రాక్ట్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారే.. అసలు మీ దృష్టి వాళ్ల డ్రెస్ మీదికి ఎందుకు వెళ్తుంది. మీ కళ్లు ఆమె డ్రెస్‌‌ని ఎందుకు చూస్తున్నాయ్. ఆ అమ్మాయి తొడలు కనిపిస్తున్నాయ్.. బొడ్డు కనిపిస్తుంది.. ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది. ఏ మీరు చూడకుండా ఉండలేరా? ఫస్ట్ మీ వక్రబుద్ధి మార్చుకోండి. మీరు చూసే చూపుఉంటుందే ఆ నీచమైన చూపునుండి బయటపడండి. మీరు చూసేదంతా చూసేని చప్పలించేస్తారు. తరువాత స్టేజ్‌ల మీదికొచ్చి కబుర్లు చెప్తారు. ఆపండి సార్.. వాళ్లు నిజంగా ఒళ్లంతా విప్పుకుని రోడ్లుమీద తిరిగితే చట్టాలు ఉన్నాయి. వాళ్లు కూడా మగాళ్ల వస్త్రధారణపై కండిషన్ పెట్టి రోడ్డు ఎక్కితే దూలతీరిపోద్ది మీకు’ అంటూ ఫైర్ ఏ రేంజ్‌లో ఫైర్ అయ్యారు నాగబాబు. 

No comments:
Write comments