మరింత ముందుకు ధర్మ పోరాటం

 

అమరావతి, ఫిబ్రవరి 13, (globelmedianews.com)
బుధవారం నాడు టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, ఇన్ చార్జులు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ గత 2రోజులుగా ఢిల్లీలో మన ధర్మ పోరాటం ఒక చరిత్ర. జాతీయస్థాయిలో టిడిపి పోరాటం దేశంలోనే సంచలనం. ఇద్దరు మాజీ ప్రధానులు, మాజీ కేంద్రమంత్రులు, ఫ్లోర్ లీడర్ల మద్దతు17పార్టీల నేతలు ఏపికి సంఘీభావం ప్రకటించారని అన్నారు. ఒక రాష్ట్ర సమస్యలపై ఢిల్లీస్థాయిలో బలంగా గొంతెత్తడం ఇదే ప్రధమం. టిడిపి ద్వారానే ఇది సాధ్యం అయ్యింది. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అన్నివర్గాల మద్దతు కూడగట్టాలి. మన ధర్మపోరాటాన్ని మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. 

 
మరింత ముందుకు ధర్మ పోరాటం

బిజెపి ఇష్ట ప్రకారం చేస్తే వదిలేది లేదు.దుర్మార్గ పరిపాలన సహించేది లేదు.  అఖిలేష్ పై ఆంక్షలు బిజెపి దుర్మార్మానికి పరాకాష్ట. రాఫెల్ కుంభకోణంతో అంతర్జాతీయంగా అప్రతిష్ట అని అన్నారు. తాళాలు దొంగలకిచ్చే చౌకీదార్ నరేంద్రమోదిదొంగలతో కుమ్మక్కయ్యే కాపలాదారు మోదిమోదిని అవమానించామనే ప్రచారాన్ని ఖండించాలని అన్నారు. బిజెపి నేతలు బరి తెగించారు, కాబట్టే ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఏమాత్రం సంకోచం లేకుండా దుర్మార్గాలు చేస్తున్నారు. నేరాలు చేసేవాళ్లకు పశ్చాత్తాపం అనేది ఉండదుతప్పుడు పనులు చేసేవాళ్లే మనపై ఎదురు నిందలు వేస్తున్నారని అన్నారు. వైసిపి,బిజెపి,టిఆర్ ఎస్ కలిసే పనిచేస్తున్నాయి కలిసే పనిచేస్తామని టిఆర్ ఎస్ నేతలే అంటున్నారు. బిజెపి,వైసిపి,టిఆర్ ఎస్ ల ముసుగు తొలగిపోయింది. కేంద్రం తోడ్పాటు లేకున్నా ఎన్నో పనులు చేశాం. రూ.లక్ష కోట్లతో రైతుల సంక్షేమం చేశాం. రూ.లక్ష కోట్లపైగా పేదలకు సంక్షేమం చేశాం. ప్రాజెక్టులపై రూ.68వేల కోట్లు వ్యయం చేశాం. యువతకు 11లక్షల ఉద్యోగాలు,ఉపాధి కల్పించామని అన్నారు. రైతులు,మహిళలు,యువతకు న్యాయం చేశాం.  చేసిన పనులే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అందరితో అభిమానంగా ఉండాలి, ఆప్యాయతగా మెలగాలి. ప్రజలతో ప్రతినిముషం మమేకం కావాలి విశ్వసనీయత ఒకరోజులో వచ్చేది కాదు. ఏళ్లతరబడి నమ్మకంతో ప్రజల్లో విశ్వసనీయత. టిడిపి పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం ఉంది5కోట్ల ప్రజల్లో పార్టీ నిబద్దతపై నమ్మకం ఉంది.  కార్యకర్తల బాధ్యత నేనే తీసుకుంటాను. పనిచేసిన అందరికీ గుర్తింపు ఇస్తాం.  టిడిపి శాశ్వతంగా అధికారంలో ఉండాలి. ప్రభుత్వం చేసిన పనులపై 80% సంతృప్తి ఉంది. పార్టీ పట్ల కూడా ప్రజల్లో 80% మద్దతు ఉండాలని అన్నారు. 

No comments:
Write comments