భూసారం పెంచేందుకు వ్యవసాయశాఖ అడుగులు

 

మహబూబ్ నగర్ , ఫిబ్రవరి 12, (globelmedianeaws.com)
భూ సారాన్ని  పెంచేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. కొత్త నినాదంతో  వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది ఇప్పటికే విచ్చలవిడిగా వాడుతున్న పురుగు మందులు, ఎరువులతో కొద్ది రోజుల్లోనే నేలలు వాటి సహజ స్వభావం కోల్పోతున్నాయి. పంటల దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. అంతే కాకుండా మోతా దుకు మించి వాడుతున్న మందుల అవశేషాలు పంట ఉత్పత్తులో మిలితమై ఉంటున్న కార ణం గా వాటిని తింటున్న మనుషులపైనా ప్రభా వం కనిపిస్తున్నది. తింటున్న ఆహారంతోనే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని పలు సర్వేల్లో వెల్ల డైంది.భూసారం పెంచేందుకు వ్యవసాయశాఖ అడుగులు

 రైతులకు అవగాహన లేక కొంత, పంట ఉత్ప త్తులు పెరగాలనే ఆశ కొంత ఈ పరిస్థి తులకు దారి తీస్తున్నది. వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చే రోగాల కారణంగా పంటలు దెబ్బతింటుంటాయి. పంటకు సోకింది రోగమా, తెగులా ముందుగా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో విస్తరణ అధికారులు లేక పోవడం రైతులకు శాపంగా మారింది. రైతులే స్వయంగా పురుగుల మందు డీలర్ల వద్దకు వెళ్లి పంట పరిస్థితిని వివరిస్తే వారిచ్చిన మందులనే తెచ్చి వాడుకునే దుస్థితి ఇప్పటి వరకు ఉంది.వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్ ప్ర భుత్వం ఈ శాఖను బలోపేతం చేయడంలో భా గంగా ఇటీవలనే వ్యవసాయ విస్తరణ అధికా రులను పెద్ద సంఖ్యలో నియమించింది. జిల్లా లో మొన్నటి వరకు 45 వ్యవసాయ విస్తరణ అధి కారుల పోస్టులు మాత్రమే ఉంటే కేవలం 24 మంది మాత్రమే పనిచేస్తుండేవారు. ఇపుడు ఈ పోస్టులను 62కు పెంచింది. ఇటీవల 33 పో స్టు లను భర్తీ చేసింది. దీంతో ఇపుడు 57 మంది వ్య వసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో అం దు బాటులో ఉన్నారు. రెండు హెక్టార్లకు ఒక విస్తర ణ అధికారి చొప్పున ఈ నియామకాలు జ రిగా యి. పంటలకు సోకే తెగుళ్లు, రోగాల నిర్దార ణ, వీటిపై రైతులకు సలహాలు సూచనలు అలాగే భూసార పరీక్షలపై అవగాహన కల్పించ డం వీరి విధుల్లో ప్రధానమైనవిగా పేర్కొంటు న్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమకు కే టాయించిన 2 వేల హెక్టార్లలో పంటలు సాగు చేసే రైతులకు అందుబాటులో ఉంటూ సల హాలు సూచనలు చేయాల్సి ఉంటుంది. పంట లపై సోకింది రోగమా, తెగులా నిర్దారించిన త ర్వాత నివారణకు ఎలాంటి మందులు వాడాలో సిఫారసు చేస్తేనే మందులు వాడాలని వ్యవసా య అధికారులు చెబుతున్నారు. బీఎస్సీ అగ్రిక ల్చర్ చదివిన ఏఈవోలు స్వయంగా మందులు రాయవచ్చని, డిప్లొమా చేసిన ఏఈఓలు మం డల వ్యవసాయ అధికారుల దృష్టికి తేవాలనీ, డిప్లొమా చేసి అనుభవం ఉన్న ఏఈవోలకు కూ డా మందులు సిఫారసు చేసే అవకాశం కల్పిస్తు న్నామని వ్యవసాయ అధికారులు చెబుతు న్నారు. అయితే వ్యవసాయ అధికారుల సిఫార సు లేనిదే మందులు విక్రయించరాదని దుకా ణాల డీలర్లకు కూడా నోటీసులు జారీ చేయబో తున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికా రులకు ఈ నెల 14న నిర్వహించే అవగాహన సదస్సులో కూడా ఈ విషయాన్ని చేర్చారు. మా ర్కెట్‌లోకి వచ్చే కొత్త రకం పురుగుల మం దులపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రచార ఆర్భాటానికి ప్రభావితులవుతున్న రైతు లు కొత్త రకం మందుల వాడకానికి ఎక్కువ మొ గ్గు చూపుతున్నారని అధికారులు భావిస్తున్నారు.  మట్టి న మూనాలు సేకరించిన నెల రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈయే డాది 14,278 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం గా పెట్టుకుని ఇప్పటికే సేకరిం చారు. మార్చి 20 వరకు పరీక్షలు పూర్తిచేసి 30 వరకు రైతులకు అందించనున్నారు. ఈ పరీ క్షలను నిర్వహిం చేందుకు జిల్లాకు వచ్చిన 10 మినీ కిట్స్‌ను ఉప యోగించుకోబోతున్నారు. వీటి ఫలితాల ఆధా రంగానే పురుగు మందులు, ఎరువుల వాడకం జరగాలనేది అధికారుల లక్ష్యంగా కనిపిస్తున్నది.

No comments:
Write comments