చిత్తు చిత్తుగా ఓడిన రోహిత్ సేన

 

ముంబై, ఫిబ్రవరి 6 (way2newstv.in)
భారత అమ్మాయిల్లాగే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన చిత్తుచిత్తుగా ఓడింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 19.2 ఓవర్లలో 139 పరుగులకే చేతులెత్తేసింది. 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రోహిత్ సేన అసలు ఏ టైమ్‌లోనూ గెలిచేలా కనిపించలేదు. 18 పరుగుల దగ్గరే రోహిత్ శర్మ (1) వికెట్ కోల్పోయిన భారత్.. ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. ధావన్ (29), శంకర్ (27), పంత్ (5), కార్తీక్ (5), హార్దిక్ పాండ్యా (4) దారుణంగా విఫలమయ్యారు. ధోనీ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.


చిత్తు చిత్తుగా ఓడిన రోహిత్ సేన

అంత‌కుముందు భారత బౌలర్లను చితగ్గొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్.. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఓపెనర్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 43 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. అతనికి మన్రో, విలియమ్సన్ కూడా తోడవడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్స్‌లు, 14 ఫోర్లు నమోదు కావడం విశేషం. కివీస్ హిట్టింగ్ ధాటికి భారత బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసినా.. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 51 పరుగులు ఇవ్వడం విశేషం. ైస్ట్రెక్ బౌలర్ భువనేశ్వర్ కూడా 4 ఓవర్లలో 47 పరుగులు, ఖలీల్ అహ్మద్ 48 పరుగులు ఇచ్చారు. మన్రో 34, విలియమ్సన్ 34, చివర్లో కుగెలీన్ కేవలం 7 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. యువ హిట్టర్ టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7x4, 6x6) అతని దెబ్బకి మ్యాచ్‌లో నాలుగేసి ఓవర్లు బౌలింగ్ చేసిన భారత్ బౌలర్లు హార్దిక్ పాండ్య (51/2), కృనాల్ పాండ్య (1/37), చాహల్ (35/1), భువనేశ్వర్ (47/1), ఖలీల్ అహ్మద్ (48/1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్సర్లు, 14 ఫోర్లు నమోదవడం కొసమెరుపు..! మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కొలిన్ మున్రో (34: 20 బంతుల్లో 2x4, 2x6) ఫోర్, సిక్స్‌తో ఆ జట్టులో ఉత్సాహం నింపగా.. ఆ తర్వాత సీఫర్ట్ జోరు అందుకున్నాడు. ఎంతలా అంటే.. భువనేశ్వర్, కృనాల్ పాండ్య బౌలింగ్‌లో అతను వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య, చాహల్‌ బౌలింగ్‌నీ సీఫర్ట్ ఉతికారేశాడు. దీంతో.. తొలి వికెట్‌కి 8.1 ఓవర్లలోనే 86 పరుగుల భాగస్వామ్యం న్యూజిలాండ్‌కి లభించింది. అయితే.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కృనాల్ పాండ్య విడదీశాడు. సిక్స్ కోసం ప్రయత్నించిన కొలిన్ మున్రో బౌండరీ లైన్ వద్ద శంకర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మున్రో ఔటైన తర్వాత సీఫర్ట్ మరింత దూకుడు పెంచాడు. అతనికి తోడుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3x6) కూడా బ్యాట్ ఝళిపించడంతో న్యూజిలాండ్‌ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. మధ్యలో మిచెల్ (8: 6 బంతుల్లో 1x4), గ్రాండ్ హోమ్ (3: 4 బంతుల్లో) నిరాశపరిచినా.. ఆఖర్లో రాస్ టేలర్ (23: 14 బంతుల్లో 2x6), స్కాట్ (20 నాటౌట్: 7 బంతుల్లో 3x4, 1x6) బౌండరీలతో ముగించారు. భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య‌, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్ 

No comments:
Write comments