లంబాడీ హట్టిలో పోలీసుల తనిఖీలు

 

కొమరం భీమ్, ఫిబ్రవరి 12 (globelmedianews.com):  
కొమరంభీమ్ జిల్లా చింతల మానేపల్లి మండలం లంబాడీ హట్టిలో పోలీస్, అటవీశాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా కలప, గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. 


లంబాడీ హట్టిలో పోలీసుల తనిఖీలు

చెట్ల నరికివేత, అటవీ ఆక్రమణలు,  గుడుంబా తయారీ తక్షణం నిలిపివేయాలని గ్రామస్థులను హెచ్చరించారు. అటవీ నేరాలకు పాల్పడవద్దని, గుడుంబాతో అనారోగ్యాలు తెచ్చుకోవద్దని కౌన్సిలింగ్ నిర్వహించారు.  ఉల్లంఘనులపై  పీడీ కేసులు పెడతామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి పొందాలని, నేరాలకు పాల్పడవద్దని కోరారు. నేరాలు చేయమని గ్రామస్థులతో ప్రమాణం చేయించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న అసిఫాబాద్ డీఎస్పీ  సాంబయ్య, అటవీ అధికారి రాజా రమణా రెడ్డి, ఎక్సయిజ్ అధికారి కిషన్ ఇతర సిబ్బంది పాల్గోన్నారు

No comments:
Write comments