స్వైన్ టెర్రర్...వణికించేస్తోంది...

 

హైద్రాబాద్ , ఫిబ్రవరి 12, (globelmedianews.com)
 రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని ప్రారద్రోలడానికి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ స్వైర విహారం చేస్తూ అమాయకుల ప్రాణాలను కబలిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో జీవించే బడుగు జీవులు ఇలాంటి ప్రాణాంతక వ్యాధులను తట్టుకోలేక, అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరే వరకు చూస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. కేవలం ఈ సంవత్సరం ఒక్క గాంధీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారు. 


స్వైన్ టెర్రర్...వణికించేస్తోంది...

ఇప్పటికి గాంధీ ఆసుపత్రిలో మరో 11మంది స్వైన్‌ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆరుగురు 10 నెలల నుంచి 10 సంవత్సరాలలోపు చిన్నారులే ఉన్నారు. చిన్నపిల్లలు, గర్భిణులపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తగిన జాగ్రత్తలుతీసుకుంటే ముందుగానే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నగరంలోని ఇతర ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతూ బాగా ముదిరిన తర్వాత గాంధీ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుంది. చలి, ఒంటినొప్పులు, విడవని జ్వరం, జలుబు దగ్గుతో ప్రారంభమయ్యే ఈవ్యాధి లక్షణాలు సామాన్య జ్వరానికి ఉండేవి కావడంతో చాలా మంది చిన్నపాటి జ్వరానికి సైతం వణికిపోతున్నారు. నగరంలో చెత్తచెదారం పేరుకుపోయి దోములు స్వైరవిహారం చేస్తున్నాయని, డెంగ్యూ వంటి ప్రాణాంత వ్యాధులు విస్తరిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు చోద్యం చూస్తున్నారు. నగరంలో విస్తరిస్తున్న అంటువ్యాధులను అరికట్టడానికి ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ విషజ్వరాలను నివారించడానికి ప్రభుత్వం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

No comments:
Write comments