రెండు వేలకు నిరుద్యోగ భృతి

 

విజయవాడ, ఫిబ్రవరి 5, (globelmedianews.com) 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఈ మేరకు యువనేస్తం కింద రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చే 'నిరుద్యోగ భృతి'ని రూ.1000 నుంచి రూ.2000 లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు మంగళవారం (ఫిబ్రవరి 5) అసెంబ్లీలో ప్రకటించారు. తాజా పెంపుతో రాష్ట్రంలోని సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనుంది. ఇక విద్యారంగానికి సంబంధించి ప్రాథమిక విద్యకు రూ.22.783.37 కోట్లు కేటాయించగా.. ఉన్నత విద్యకు రూ.3,171.63 కోట్లు మేర కేటాయింపులు జరిపారు. 


రెండు వేలకు నిరుద్యోగ  భృతి

2014 ఎన్నికల సమయంలోనే టీడీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు నెలకు రూ.1000లను నిరుద్యోగులకు అందిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న రూ.1000కి అదనంగా మరో వెయ్యి రూపాయలను జోడించి రూ.2000 ఇవ్వాలని ఇటీవల జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు పెంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 ఏడాదికి గానూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.26 లక్షల కోట్ల మేర బడ్జెట్‌నున రూపొదించారు. మొత్తం బడ్జెట్ 2.26 లక్షలు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షలు కాగా, మూలధన వ్యయం రూ.29,596 కోట్లుగా ఉంది

No comments:
Write comments