ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

 

టిటిడి తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం  
ఒంటిమిట్ట, ఫిబ్రవరి 14 (globelmedianews.com)
టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని గురువారం జెఈవో సందర్శించారు. ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


 ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామన్నారు. టిటిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వాహనమండపం, మాడవీధులలో సిసి రోడ్లు, మరుగుదొడ్లు తదితర పనులు దాదాపు పూర్తికావచ్చాయని, మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కొరకు టిటిడి అనే నినాదంతో ముందుకు వెలుతున్నట్లు తెలిపారు.
గత అనుభవాలను దృష్టిలోఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన కల్యాణవేదిక నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పార్కింగ్‌ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక, అహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మొక్కలను విరివిగా నాటాలని డిఎఫ్‌వోను ఆదేశించారు. విద్యుత్‌ ఉపకేంద్రంను మార్చి మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా పోటు మరమ్మతులు, ఫ్లోరింగ్‌ పనులను భారత పురావస్తు శాఖ చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నామని జెఈవో తెలిపారు. శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఊరేగింపుకు ఇబ్బందిలేకుండా మాడ వీధుల విస్తరణ చేపట్టేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఒంటిమిట్టకు విచ్చేసే భక్తుల వసతి కొరకు కల్యాణ వేదిక వద్ద నిర్మించిన వసతి సమూదాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 
ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాలకు ఏప్రిల్‌ 12న వ్యాసాభిషేకంతో బ్రహ్మూత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్‌ 13న ధ్వజారోహణం, ఏప్రిల్‌ 18న శ్రీరాములవారి కల్యాణం, ఏప్రిల్‌ 22వ తేదీ పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాదిలాగానే శ్రీరాములవారి కల్యాణం నిర్వహించే ప్రాంతంలోని కల్యాణ వేదిక వద్ద ఈ ఏడాది కూడా తాత్కాలిక పందిళ్లు వేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బ్రహ్మూెత్సవాలలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లను పటిష్టంగా చేయనున్నట్లు తెలియజేశారు.  

No comments:
Write comments