కూటమికి పెద్దన్న పాత్రలో చంద్రబాబు...

 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13, (globelmedianews.com)
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలు అందివచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. రొటీన్ గా జరిగే సిబిఐ దర్యాప్తు కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అడ్డుకోవడం నేరుగా ప్రధాని మోడీతో తలపడి ప్రాంతీయ పార్టీల కూటమికి తానే రాణిగా నిరూపించుకునే ప్రయత్నం విజయవంతంగా చేశారు. వివాదం బెంగాల్ ది అయినప్పటికీ అవసరానికి మించి అక్కడి గొడవలో కూడా దూరారు ఎపి సిఎం. స్వయంగా బెంగాల్ వెళ్ళి మరీ మమతకు నిమ్మరసం ఇచ్చి దీదీ దీక్ష విరమింప చేశారు చంద్రబాబు. కూటమికి తాను పెద్దన్న లాంటివాడినని చెప్పకనే చెప్పారు ఆయన. 


 కూటమికి పెద్దన్న పాత్రలో చంద్రబాబు...


ఇక సంకీర్ణం లో ఛాన్స్ వస్తే ప్రధాని కావొచ్చన్న ఆలోచన వున్న మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, మాజీ సీఎం శరద్ యాదవ్, మరో మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా ఒకరి చేతులు మరొకరు విడవకుండా పట్టుకు తిరుగుతున్నారు.ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలందరితో టచ్ లోకి వచ్చేశారు చంద్రబాబు. టిడిపి కి ప్రధాన శత్రువు కాంగ్రెస్ తో కూడా దోస్తీ కట్టారు. మమత బెనర్జీ తో గతం నుంచి వున్న రాజకీయ అనుబంధాన్ని మరింత పరిపుష్టం చేసుకుని కెసిఆర్ కు చెక్ పెట్టాలని గట్టి కసరత్తే చేశారు బాబు. ఆమె చేపట్టే ప్రతి కార్యక్రమంలో తనదైన పాత్రే పోషిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హస్తినలో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు భారీ ఉద్యమమే ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో సహజంగానే మమత బెనర్జీ ప్రధాన ఆకర్షణ అవుతారని అంతా భావించారు. కానీ చిత్రంగా మమత ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం టిడిపి శ్రేణులను నిరాశకు గురిచేసింది. కానీ మమత మొక్కుబడిగా బాబు కు ఫోన్ చేసి మాత్రం దీక్షకు మద్దతు పలికి ఊరుకున్నారు.ప్రధాని మోడీ టార్గెట్ గా ప్రాంతీయ పార్టీల కూటమి మహాకూటమిగా ఏర్పాటు అయ్యింది. ఈ కూటమిలో ఇప్పటివరకు 22 ప్రాంతీయ పార్టీలు యాక్టివ్ గా వున్నాయి. కాంగ్రెస్ కూడా ఇందులో భాగం… అయినా రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారు క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో పోటీ పడుతున్న వారిలో మమత, మాయావతి ముందు వరుసలో వున్నారు. వీరిద్దరికి చంద్రబాబు ప్రధాని రేసులోకి చివర్లో దిగుతారన్న అనుమానాలు బలంగా ఉన్నట్లు విశ్లేషకులు లెక్కేస్తున్నారు. అందువల్లే బాబు తో జాగ్రత్తగా ఉండేందుకే మమత, మాయావతి దూరం కాకుండా, దగ్గరగా లేకుండా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. కొందరు ముఖ్యులు. బాబు దీక్ష కు రానప్పటికీ జాతీయ రాజకీయాల్లో తన ముద్రను ఎపి సిఎం ఒక్క దెబ్బతో చాటారని విమర్శకులు సైతం వ్యాఖ్యానించడం విశేషమే

No comments:
Write comments