తలసాని హడావిడికి కేటీఆర్ షాక్...

 

హైద్రాబాద్, ఫిబ్రవరి 14, (globelmedianews.com)
టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఆ పార్టీ యువ‌నేత కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సాదాసీదా రాజ‌కీయాల‌కు భిన్నంగా ఉండే ఈ యువ‌నేత అదే త‌ర‌హాలో మ‌రో కీల‌క డెసిష‌న్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఈ నిర్ణ‌యం త‌న తండ్రి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కేంద్రంగా తీసుకున్న‌ది. అయితే, ఈ నిర్ణ‌యం పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత‌కు కౌంట‌ర్‌లా ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఆ సీనియ‌ర్ నేత మ‌రెవ‌రో కాదు…హైద‌రాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌.వివ‌రాల్లోకి వెళితే…ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు.


తలసాని హడావిడికి కేటీఆర్ షాక్...

పార్టీ ర‌థ‌సారథి కం సీఎం పుట్టిన‌రోజు అంటే స‌హ‌జంగానే ఆ రోజున బ్యానర్లు, ప్రకటనలు వంటి ప్రచారం హోరెత్తుతుంది. అయితే, ఇలా పార్టీ శ్రేణులు స‌న్న‌ద్ధం అవుతున్న త‌రుణంలోనే…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌పై డబ్బులు వృధా చేయకుండా.. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని కేటీఆర్ అన్నారు. మొక్కలు నాటి సీఎంపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుదాం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం కేసీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు ఓ రేంజ్‌లో సిద్ధ‌మ‌య్యారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేర‌కు వాటిని పర్యవేక్షించారు కూడా.జలవిహార్లో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లను ఘ‌నంగా చేస్తున్నామ‌ని…హోమాలు, యజ్ఞాలు, కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ పెడుతున్నామ‌న్నారు.దీంతో పాటుగా న‌గ‌ర‌వ్యాప్తంగా పుట్టిన‌రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సెల‌విచ్చారు.మ‌రి….టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశం నేప‌థ్యంలో త‌ల‌సాని ఏం చేయ‌నున్నారు?   కేటీఆర్ ఇచ్చిన ఇండైరెక్ట్ ఆర్డ‌ర్‌తో త‌ల‌సాని ఏర్పాట్ల‌ ప‌రిస్థితి ఏంటి అనే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది.

No comments:
Write comments