మార్చి 10 న పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించండి .

 

జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిద్దిపేట, మార్చి 09 (globelmediaenws.com
మార్చి 10 న నిర్వహిస్తున్న పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని సిద్దిపేటలోని పాత బస్టాండ్ నుండి విక్టరీ టాకీస్ చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయ చౌరస్తా వరకు పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని నిర్వహించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,  నర్సులు , ట్రైనీ నర్సు విద్యార్థులు మానవ హారాన్ని ఏర్పాటు చేశారు . 


మార్చి 10 న పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించండి .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హాజరై జండా ఊపి ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు , ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా భారత దేశంలోని 682 జిల్లాలలో ఏ ఒక్క జిల్లాలో కూడా పోలియో కేసు నమోదు కాలేదని  రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు , పోలియో చుక్కలు  జిల్లా లోని ప్రతి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి మార్చ్ 10న వేయించాలని ఆయన పిలుపు నిచ్చారు , ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు , ఇందుకోసం ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయ సహకారాలు అయినా చేయటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి , జిల్లా వైధ్యాదికారి అమర్ సింగ్ , గడా వైద్య అధికారి కాశినాథ్ , జిల్లా వైద్య అధికారులు , నర్సులు , ట్రైనీ నర్స్  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

No comments:
Write comments