తెలంగాణలో 1000 టన్నుల విత్తన ఎగుమతులు

 

హైద్రాబాద్, మార్చి 7, (globelmedianews.com)
తెలంగాణ విత్తన పరిశ్రమ కు మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 60 శాతం విత్తన అవసరాలకు విత్తనాలు అందిస్తున్న తెలంగాణ తన పరిది ని విదేశాల కు విస్తరణ చేపట్టింది. ఈ ఏడాది 1000 టన్నుల విత్తన ఎగుమతిని చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గతంలో పలు దేశాల కు విత్తనాలు ఎగుమతి చేసిన తెలంగాణ తాజాగా దక్షిణాఫ్రికా ఖండం పై గురి పెట్టింది. అక్కడి వాతావరణ పరిస్థితులు మన వాతావరణా నికి దగ్గరగా ఉండటంతో ఆ దేశాలు మన తెలంగాణ నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా సౌతాఫ్రికా ఖండంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కి పని చేస్తున్న సంస్థల ప్రతినిధుల బృందం తెలంగాణ ప్రభుత్వం సమావేశమైంది. తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, విత్తనాభివృద్ది, దృవీకరణ సంస్థ సంచాలకుడు డా:కేశవులు ఈ బృందం తో సమావేశమయ్యారు. వరి, పొద్దు తిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. 


తెలంగాణలో 1000 టన్నుల విత్తన ఎగుమతులు

ఇక్కడి వ్యవసాయ విధానం, విత్తనోత్పత్తి పద్ధతులు,విత్తన పరిశ్రమ గురించి పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ 90శాతం హైబ్రిడ్ విత్తన ఉత్పత్తి తెలంగాణ లోనే జరుగుతుంది అన్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ విద్య, పరిశోధన సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయన్నారు.కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల 400 విత్తన కంపెనీ లు, ప్రాసెసింగ్ ప్లాంట్ లు,శీతల గిడ్డంగులు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. విత్తన ఉత్పత్తి తో పాటు, వాటిని నిలువ చేసేందుకు మంచి వాతావరణం ఉందన్నారు. వరి విత్తన ఉత్పత్తి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో భారీ గా జరుగుతుంది అన్నారు. దీంతో విత్తన అభివృద్ధి, దృవీకరణ సంస్థల ను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.గతేడాది సూడాన్, ఫిలిప్పీన్స్, రష్యా, టాంజానియా దేశాల కు వరి,జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎగుమతి చేశామన్నారు. ఈసారి మరిన్ని దేశాల కు ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. దీంతో ఈ ఏడాది 1000 క్వింటాలు విత్తనాలు ఎగుమతి చేయడానికి నిర్ణయించామన్నారు. మేనేజర్ జాసర్ నికర్సన్, అగ్రికల్చర్ ఎక్సిపీరియన్స్ లిమిటెడ్ సంచాలకుడు అవైన్ కానర్స్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments