29 తర్వాత మోడీ తెలంగాణ టూర్ కోసం ప్లాన్

 

హైద్రాబాద్, మార్చి 19, (globelmedianews.com)
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారానికి బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ప్ర‌క్రియ కూడా పూర్తి చేసిన పార్టీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డంతో ఈ ఎన్నిక‌ల్లో సత్తా చాటి తెలంగాణ‌లో బీజేపీకి కూడా ప‌ట్టుంద‌ని నిరూపించ‌డానికి పార్టీ నేత‌లు త‌హత‌హలాడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ అగ్ర‌శ్రేణి నేత‌లు వ‌చ్చి ప్ర‌చారం చేసినా పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోవ‌డంతో.. ఈసారి ఆ సీన్ రిపీట్ కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీకి ప‌ట్టున్న ప్రాంతాల్లో మాత్రమే పార్టీ అగ్ర‌నేత‌ల ప్ర‌చారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్ప‌టికే పార్టీ అగ్ర‌శేణి నేత‌లు దేశ‌వ్యాప్త ప్ర‌చారాల్లో బిజిబిజీగా గ‌డుపుతున్న నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఒక్క రోజు కేటాయించాల‌ని బిజేపీ రాష్ట్ర నేత‌లు అభ్య‌ర్ధ‌న పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా మోదీ, అమిత్ షా ల‌ను ప్ర‌చారానికి తీసుకురావ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


29 తర్వాత మోడీ తెలంగాణ టూర్ కోసం ప్లాన్

ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తే బాగుంటుందో ఒక షెడ్యూల్‌ను కూడా బిజేపీ హైక‌మాండ్‌కి పంపించిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి కాస్త ప‌ట్టున్న ప్రాంతాలైన‌, నిజామాబాద్, సికింద్రాబాద్, చేవేళ్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో మోదీ, అమిత్ షా పర్యటనలు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ మేరకు మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 లోపు ఏదో ఒక రోజు త‌మ రాష్ట్రానికి కేటాయించాల‌ని ఢిల్లి పెద్ద‌ల‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇప్ప‌టికే టీఆర్ఎస్ ప్ర‌చారంలో దూసుకుపోతోంది. 16 స్థానాలు గెల‌వ‌డ‌ం ఆ పార్టీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇప్ప‌టికే పార్టీ అధినేత కేసీఆర్ అన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. కేంద్రంలో బిజేపీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు.కేసీఆర్ దూకుడుకు క‌ళ్లెం వేయాలంటే పార్టీ పెద్ద‌ల స‌భ‌లు తెలంగాణ‌లో నిర్వ‌హించ‌డ‌మే స‌రైన మార్గ‌మ‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. అయితే తెలంగాణ‌లో ప్ర‌చారం చేయ‌డానికి స‌మ‌యాన్ని కేటాయించ‌డంపై ఢిల్లీ పెద్ద‌లు ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. గెలిచే ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో వారు ఉన్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో తెలంగాణ‌లో ప్ర‌చారం చేస్తే ఏ మేర‌కు పార్టీకి క‌లిసొస్తుందని లెక్కలు వేసుకున్న తర్వాతే బీజేపీ పెద్దల నుంచి రాష్ట్ర పార్టీ వర్గాలకు పర్యటనలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి ఈ నెల చివ‌రి వారం లేదా వ‌చ్చే నెల మొద‌టి వారంలో తెలంగాణ‌లో మోదీ, అమిత్ షా స‌భ‌లు ఉంటాయంటున్నారు తెలంగాణ బిజేపీ నేత‌లు.

No comments:
Write comments