4 వరోజు లాభాలే

 

ముంబై, మార్చి 7, (globelmedianews.com)
దేశీ స్టాక్ మార్కెట్ లాభాల ట్రెండ్ కొనసాగుతోంది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం కూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 36,725 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11,058 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ.. ముడిచమురు ధరలు పతనం, రూపాయి ర్యాలీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహం వంటి తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. 


4 వరోజు లాభాలే

నిఫ్టీ 50లో ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎల్అండ్‌టీ 2 శాతానికి పైగా పెరిగింది. ఎంఅండ్ఎం కూడా దాదాపు 2 శాతం లాభపడింది. అదేసమయంలో ఐఓసీ, కోల్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, విప్రో, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటొకార్ప్ షేర్లు నష్టపోయాయి. ఐఓసీ, కోల్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, విప్రో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయిసెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడింది. 

No comments:
Write comments