పుల్వామా అమరులైన సైనికుల కుటుంబాలకు ఏరీస్ గ్రూప్ 40 లక్షల ఆర్ధిక సహాయం

 

హైదరాబాద్ మార్చ్ 12 (globelmedianews.com)
దేశ సరిహద్దులోని పుల్వామా టెర్రరిస్ట్ ల దాడిలో దైర్య సాహసాలు ప్రదర్శించి  అమరులైన సైనికుల కుటుంబాలకు ఏరీస్ గ్రూప్ ఆర్ధిక సహాయం ప్రకటించింది.ఈ దాడిలో చనిపోయిన కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహయం అందించాలని కంపిని నిర్ణయించింది. దుబాయ్ కి చెందిన బిలేనీర్స్ క్లబ్ ద్వార ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు కంపిని తెలియజేసింది.


పుల్వామా అమరులైన సైనికుల కుటుంబాలకు ఏరీస్ గ్రూప్ 40 లక్షల ఆర్ధిక సహాయం

అదేవిదంగా ఈ కుటుంబాలకు ఆర్ధిక సహాయం తో పాటు విద్య ,వైద్యం,ఉద్యోగ భద్రతా తదితర అవసరాలను తీరుస్తామని ఏరీస్ గ్రూప్ వ్యవస్థాపక డైరెక్టర్ సోహన్ రాయ్ తెలిపారు.ఈ సహాయం అందజేయడానికి అవసరమైన ప్రణాలికను ఇండి వుడ్ రుపొందిస్తుందని, సహాయ కార్యక్రమాలను ఇండి బిలినేస్స్ క్లబ్ పర్యవేక్షిస్తుందని  తెలిపారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల త్యాగాలు మర్చిపోమని కేరలాకు చెందినా ప్రసన్నకుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.

No comments:
Write comments