40 డిగ్రీలకు చేరుకున్న టెంపరేచర్

 

అదిలాబాద్, మార్చి 13, (globelmedianews.com)
రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. ఎండాకాలం ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బుధవారం 40 డిగ్రీలు దాటింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 40.1 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొనింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని, రానున్న రెండు మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు ఈసారి అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 


40 డిగ్రీలకు చేరుకున్న టెంపరేచర్

కామారెడ్డిలో 40 డిగ్రీలు, నిర్మల్‌లో 39.9 డిగ్రీలు, ఖమ్మంలో 39.8, రాజన్న సిరిసిల్లలో 39.8, జయశంకర్ భూపాలపల్లిలో 39.6, సూర్యాపేటలో 39.5, వికారాబాద్ 38.9, ఆదిలాబాద్ 39, జగిత్యాల 39.4, కరీంనగర్ 39.3, యాదాద్రి భువనగిరి 37.9, మహబూబ్‌నగర్ 39, హైదరాబాద్ 39.3 జోగులాంభ గద్వాల్ 39.4 డిగ్రీలుగా నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరత్వాడా మీదుగా 0.9 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనేపథ్యంలో రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా, ఆంధ్ర, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం సమయంలో తమ పనులను చూసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

No comments:
Write comments