టెన్త్ పరీక్షలక 5.52 లక్షల మంది

 

హైద్రాబాద్, మార్చి 14 (globelmedianews.com)
రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,563 పరీక్షా కేంద్రాలు,144 ఫ్లయింగ్, 4 ప్రత్యేక స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షలకు 5,52,302 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఇంగ్లీష్-2 పరీక్ష ఏప్రిల్ 3కు వాయిదా పడింది. హాల్ టికెట్లు అందని విద్యార్థులు బోర్డు వెబ్సైట్ బీఎస్ఈతెలంగాణ డాట్ ఓర్జీ సైటునుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.


టెన్త్ పరీక్షలక 5.52 లక్షల మంది

No comments:
Write comments