సర్కార్ దవాఖానాల పరిస్థితి ఏంటో...

 

హైద్రాబాద్, మార్చి 8, (globelmedianews.com)
జనాభాలో ఎక్కువ మంది అత్యవసర సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, కొండంత ఆశతో ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తుంటారు. వారి అవసరాన్ని ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బంది బలహీనతంగా చూస్తూ తీవ్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. ఆసియాలోనే పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో కనీసం రోగులను తీసుకెళ్లేందుకు వీల్‌చైర్లు లేకపోవటం, ఉస్మానియా ఆసుపత్రిలో కనీస పారిశుద్ద్యం లోపించటం వంటి సమస్యలున్నా, అపస్మారక స్థితిలో వేరే గత్యంతరం లేక ప్రజలు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ అక్కడి సిబ్బంది రోగులకు పట్ల చులకన భావనతో, దురుసుతో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న తీరు నెలల వయస్సున్న ఒక శిశువు మృతికి, మరో ముగ్గురు వెంటిలెటర్లపై మృత్యువుతో పోరాడేందుకు కారణమైంది. సౌకర్యాల లేమి, సిబ్బంది కొతర కారణంగా నేటికీ చాలా పీహెచ్‌సీల్లో వైద్యుల విధులను కింది స్థాయి సిబ్బందే నిర్వహిస్తుండటం గమనార్హం. 


సర్కార్ దవాఖానాల పరిస్థితి ఏంటో...

నాంపల్లి పీహెచ్‌సీలో కూడా చిన్నారులకు కింది స్థాయి సిబ్బందే టీకాలు వేసినట్లు, అందుకే ప్యారసెట్‌మాల్‌కు బదులుగా ట్రమడోల్ మాత్రలిచ్చినట్లు వాదనలు విన్పిస్తున్నాయి. ప్రాథమిక కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం మొత్తం 20 మంది శిశువుల ప్రాణాల పాలిట శాపంగా మారింది. సర్కారు వ్యాక్సిన్ వేయించుకున్న చిన్నారులకు జ్వరం రాకుండా ఇవ్వాల్సిన ప్యారాసిట్‌మాల్ మాత్రకు బదులుగా ఒళ్లు నొప్పి, ఇతర గాయాలు వంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు పెద్దవాళ్లకు ఇచ్చే ట్రమడోల్ మాత్రలను ఇవ్వటం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది వైద్య అవగాహన, పనినైపుణ్యతకు నిదర్శనం. నగరంలో వందల సంఖ్యలోనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శాస్ర్తియంగా, సాంకేతికంగా వైద్య రంగంపై నైపుణ్యత ఎంత అన్న ప్రశ్నకు సమాధానమే కరవైంది. రెండురోజలు క్రితం నాంపల్లి పీహెచ్‌సీలో చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చిందేవరు? ఆ తర్వాత జ్వరం రాకుండా ఇవ్వాల్సిన ప్యారసెట్‌మాల్ మాత్రకు బదులుగా ట్రమడోల్ మాత్ర ఇచ్చిందెవరు అన్న ప్రశ్నకు అక్కడి సిబ్బంది సమాధానం చెప్పటం లేదు. అంతేగాక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారు?

No comments:
Write comments