చర్చనీయాంశంగా లగడపాటి, వంగవీటి భేటీ

 

విజయవాడ, మార్చి 6, (globelmedianews.com)
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణల భేటీ నగరంలో చర్చనీయాంశమైంది.   వీరిద్దరూ విజయవాడ నగరంలో సమావేశమయ్యారు.  దీనికి ముందు లగడపాటి రాజగోపాల్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్తో భేటీ అయ్యారు.  అనంతరం లగడపాటి రాజగోపాల్ విజయవాడకు వచ్చి రాదాకృష్ణతో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.  


చర్చనీయాంశంగా లగడపాటి, వంగవీటి భేటీ

వైకాపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థానాన్ని ఆశిస్తున్న వంగవీటి రాధాకృష్ణ ఆ తరువాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా వైకాపా నుంచి బయటకు వచ్చారు.  కొద్ది రోజుల కిందట తెదేపాలో చేరతారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.  ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్, వంగవీటి రాధాకృష్ణల భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

No comments:
Write comments