అగ్ని పరీక్ష్ గా మారిన అదిలాబాద్ ఎన్నికలు

 

అదిలాబాద్, మార్చి 11 (globelmedianews.com)
ఊహించని విధంగా తొలివిడతలోనే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయగా అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారనుంది. ఆదివారం లోక్‌సభ ఎన్నికలకు ప్రకటన విడుదల కాగా ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ కోసం ఈనెల 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు గావిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ కావడంతో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 14న టీఆర్‌ఎస్ తరపున ఆదిలాబాద్ కేంద్రంలో పార్లమెంటరీ స్థాయి సన్నాహక సదస్సును నిర్వహిస్తుండగా ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరవుతున్నారు. నామినేషన్ల గడవు సమీపించడంతో లోక్‌సభ అభ్యర్థిగా తిరిగి ఎంపి గెడం నగేష్ పేరును ఖరారు చేసే అవకాశాలు అధికంగా ఉండగా పరిశీలనలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త, టిజివో అధ్యక్షుడు శ్యాంనాయక్ పేరు కూడా పార్టీలో వినిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది స్పష్టత రానుంది. 


అగ్ని పరీక్ష్ గా మారిన అదిలాబాద్ ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికలకంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయిన అభ్యర్థులు ఎంపి టికెట్‌పై అంతగా ఆసక్తిచూపడం లేదు. బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో గిరిజన వర్గపోరు ప్రభావం ఇప్పటికీ రాజకీయ పార్టీల్లో అందోళన కల్గిస్తుండగా లంబాడా లేదంటే ఆదివాసీ తెగకు చెందిన వర్గ సమీకరణతో అభ్యర్థిని ఎంపిక చేసేలా కాంగ్రెస్, బిజెపి అధిష్ఠానాలు కసరత్తు చేస్తున్నాయి.ఆదివాసీల ఓటు సహజంగా అధికంగా ఉన్నప్పటికీ ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో గిరిజనేతరుల ఓట్లే కీలకం కావడంతో సమర్థులైన అభ్యర్థులను రంగంలోకి దించేలా వ్యూహరచనలు సాగిస్తున్నారు. టీ ఆర్ ఎస్ నుండి ఆదివాసీ తెగకు చెందిన గెడం నగేష్ మరోసారి బరిలో ఉంటే కాంగ్రెస్, బిజెపి నుండి మాత్రం లంబాడా అభ్యర్థిని బరిలో దించేలా ఎత్తులు వేస్తున్నారు. ఆర్థిక స్థోమత కలిగిన నేతలు లోక్ సభ బరికి ముందుకు రాకపోవడంతో మాజీ ఎంపి రమేష్ రాథోడ్ లేదంటే కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామంటేనే తాము పోటీ చేస్తామని వీరిద్దరు నేతలు అధిష్ఠానం ముందు తేల్చిచెప్పినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు కూడా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఖర్చుమాత్రం భరించలేనని తేల్చిచెబుతున్నారు. బిజెపి నుండి లోక్‌సభ అభ్యర్థిగా హిందుత్వ నినాదంతో పరిపూర్ణానంద స్వామి పేరును తెరపైకి తెస్తున్నా ఆయన ఇక్కడి నుండి పోటీచేసేందుకు విముఖత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల స్వీకరణకు మరో వారం రోజుల గడవు ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు అనే్వషించాల్సిన విడ్డూర పరిస్థితి జిల్లాలో నెలకొంది

No comments:
Write comments