హత్య కేసులలో శ్యాం బాబుకు విముక్తి

 

సుప్రీంకోర్టులో కేసు కొట్టివేత
సంబరాలలో కే.యి అనుచరులు.
మద్దికేర మార్చి 11  (globelmedianews.com)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసును సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసిందని మద్దికేర ఎంపీపీ పద్మావతి,  మండల మాజీ కన్వీనర్ ధనుంజయ తెలియజేశారు. సోమవారం మీడియాతో వారు మాట్లాడారు.  గత ఏడాది మే 21 న  చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద కొందరు వ్యక్తులు హత్య చేశారని,ఈ కేసుకు సంబంధించి పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కె.ఇ శాం బాబును ముద్దాయిగా చార్జిషీటులో చేర్చడం జరిగిందని వారు తెలియజేశారు. 


హత్య కేసులలో శ్యాం బాబుకు విముక్తి

అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో చార్జిషీట్ నుండి శ్యాం బాబు పేరు తొలగించడం జరిగిందన్నారు. తదనంతరం నారాయణరెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి   డోన్ కోర్టులో ప్రైవేటు కేసు వేసిందని, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును న హై కోర్ట్ కేసును కొట్టివేసిందని తెలియజేశారు. అనంతరం చెరుకులపాడు శ్రీదేవి సుప్రీం కోర్టును ఆశ్రయించిన తర్వాత వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని బలపరిచి చెరుకులపాడు శ్రీదేవి వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టివేసిందని వారు తెలియజేశారు. శ్యాం బాబు పై ఉన్న కేసు కొట్టివేయడంతో కేఈ అనుచరులు మరియు టిడిపి నాయకులు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.

No comments:
Write comments