మే నెలలో మున్సిపాల్టీ ఎన్నికలు

 

హైద్రాబాద్, మార్చి 11, (globelmediaenws.com)
మున్సిపాలిటీ పాలక వర్గాల గడువు త్వరలో ముగియనుండడంతో మరో మూడు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే మొదటి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసి మే 31లోగా పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డులను పెంచడంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైనా గ్రామ పంచాయతీలను అధి కారులు సమీప వార్డుల్లో సర్దుబాటు చేశారు.మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. మే 31లోగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ డైరెక్టర్, కమిషనర్‌ నుంచి మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు ముసాయిదా జాబితా తయారీకి ఆదేశించింది. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. వీటి బాధ్యతలను కమిషనర్లకు అప్పగించారు. ఈ నెల 16న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.


మే నెలలో మున్సిపాల్టీ ఎన్నికలు

 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. 27న తుది జాబితాను విడుదల చేస్తారు. 28న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డులకు తోడు మరో ఐదు వార్డులు పెంచాలంటూ మున్సిపల్‌ కౌన్సిల్, ఎమ్మెల్యే జోగు రామన్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖకు విన్నవించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపాలిటీలో కొత్తగా వార్డులు పెరుగుతాయా..లేక ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా..? అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోందిమున్సిపాలిటీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కుటుంబంలోని ఓటర్లు అందరు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు విని యోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితాలను రూపొందించే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారితోపాటు సహాయ అధికారిని నియమించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఎన్నికల ముసాయిదా విడుదల చేసింది. కొత్తగా వార్డులు పెంచుతారా..లేక సర్దుబాటు చేసిన వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారి సంఖ్య అన్ని పార్టీలలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వార్డులు పెరిగితే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకునే అశావహుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.

No comments:
Write comments