నగరానికి ముందుగానే మామిడి

 

హైద్రాబాద్, మార్చి 14, (globelmedianews.com)
హైద్రాబాద్ నగరానికి ఈ ఏడాది మామిడి పండ్లు  ముందుగానే వ చ్చాయి. పంట తొందరగా మార్కెటుకు రావ డంతో మామి డి సీజన్ ముందుగానే  ప్రారంభ మైందని చెప్పవ చ్చు. ప్రస్తుతం ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరగవచ్చని వ్యాపా రులు చెబుతున్నారు. హోల్‌సేల్  మార్కెట్లోనే మంగలవారం  మామిడి పండ్లు కేజీ రూ. 40 పలుకుతున్నాయి. 


నగరానికి ముందుగానే మామిడి

దిగుబడి తగ్గడంతో పాటు పంట తొందరగా రావడంతో బహిరంగ మార్కెట్లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువగానే ఉండవచ్చని వ్యాపారుల అంచనా.మంగళవా రం బహిరంగ మార్కెట్లో బెనిషాన్ కిలో ధర రూ. 70 వరకు ధర పలికింది. గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకుంటే ఈ ఏడాది మార్చిలోనే జోరందుకుందని వ్యాపా రులు చెబుతున్నారు.  ఈ ఏడాది పూత సమ యంలో వర్షాల కారణంగా పంటకు నష్టం కలగడంతోపాటు అనుకున్న స్థాయిలో మామి డి పంట రాలేదని రైతులు చెబుతున్నారు.  మార్చి నెల ముగిసే సరికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి మార్కెటుకు   రావచ్చని అంచనా. 

No comments:
Write comments